మాజీ ప్రధాని వాజ్‌పేయి పార్థివ దేహం బిజెపి ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. వాజ్‌పేయి నివాసం కృష్ణమీనన్ పార్కునుంచి దీన్‌దయాళ్ మార్గ్‌లోని బిజెపి కార్యాలయానికి వాజ్‌పేయి పార్థివ దేహం చేరింది. మధ్యాహ్నం 1 గంట వరకూ వాజ్‌పేయికు నివాళులర్పించడానికి సందర్శకులను అనుమతిస్తారు. ఒంటి గంటకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్‌పేయి పార్థివ దేహానికి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమిళనాడు, కర్ణాటక గవర్నర్లు నివాళులర్పించారు.