కరీంనగర్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సోదరుడు గంగుల ప్రభాకర్ మృతి చెందారు. నగర శివారులోని రేకుర్తి వంతెన వద్ద ప్రభాకర్ మృతదేహం ఉంది. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన ప్రభాకర్ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రభాకర్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభాకర్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.