న్యూఢిల్లీ: టి 1 ప్రైమ్ ట్రక్ రేసింగ్ చాంపియన్‌షిప్ సీజన్ 4లోకి ప్రవేశించిన టాటా మోటర్స్ తన సామర్థ్యాన్ని మరోమారు నిరూపించుకుంది. భారతలోని వాణిజ్య వాహనాల విక్రయంలో తన ధీటైన భాగస్వామ్యాన్ని నిరూపించుకుంది. సీజన్ 4లో జరిగిన టి 1 ట్రక్స్ కాంపిటీషన్లో తన శక్తిని రెండింతలు వ్యక్తం చేసింది. దీనిలో ఆల్ న్యూ 1000 బిహెచ్పి టి 1 ప్రైమ్ రేస్ ట్రక్ తన సత్తా చాటింది. బ్రిటన్, యూరోప్‌లకు చెందిన ఎఫ్ఐఎ సారధ్యంలో ఈ పోటీలు జరిగాయి. కాగా ఈనూతన ట్రక్‌ను యుఎస్ భాగస్వామ్యంతో టాటా మోటర్స్ రూపొందించింది.