'కాటమరాయుడు' సినిమా భారీస్థాయిలో రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది తమిళంలో అజిత్ చేసిన 'వీరమ్' సినిమాకి రీమేక్. అప్పట్లో 'వీరమ్' .. 'వీరుడొక్కడే' పేరుతో తెలుగులోను విడుదలైంది. అదే కథ కనుక .. ఆ ప్రభావం 'కాటమరాయుడు' సినిమాపై పడుతుందేమోనని పవన్ ఫ్యాన్స లో కొంతమంది బెంగపెట్టుకున్నారు.
అలాంటి భయం అవసరం లేదని ఈ సినిమా టీమ్ చెబుతోంది. 'వీరమ్' లైన్ .. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మాత్రమే ఈ సినిమా కోసం తీసుకున్నారట. ఫస్టాఫ్ లో కొంత .. సెకండాఫ్ లో పూర్తి స్థాయిలోను కథను మార్చేశారట. కొత్తగా ఒక స్రై్టట్ సినిమాను చూసిన ఫీలింగే ఉంటుందని అంటున్నారు. అందువలన 'కాటమరాయుడు'పై 'వీరమ్' ప్రభావం గానీ .. దాని అనువాదం ప్రభావంగాని పడదని బలంగా చెబుతున్నారు.