ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరయు సినిమా ఫస్‌‌ట లుక్‌ లాంచ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 02:23 AM

భగీరథ్‌ పరశురామ్‌ ప్రొడక్షన్‌‌స బ్యానర్‌ పై బలరామనాయుడు కర్రీ సమర్ప ణలో,భగీరథ్‌ పరశురామనాయుడు మరియు రమాదేవి కర్రీ నిర్మాతలుగా తెరకెక్కిన సినిమా సరయు అన్ని ప్రొడక్షన్‌‌స పనులు పూర్తి చేసుకుని సెన్సార్‌ కు సిద్దమయింది.ఈ సందర్బంగా ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫస్‌‌ట లుక్‌ రిలీజ్‌ చేసారు.అనంతరం అయన మాట్లాడుతూ ...దర్శకుడు శ్రీనివాస్‌ నాద గ్గర చాలాకాలం దర్శకత్వశాఖలో పనిచేసాడు.ఇప్పుడు సరయు సినిమా తో దర్శ కుడుగా మారటం చాల సంతోషంగా ఉంది.ఇది లవ్‌ మరియు థ్రిల్‌ సబ్జెక్టు. అందరు కొత్తవాళ్లను ఎంచుకుని సినిమా తీయటం కష్టం అయినప్పటికీ చాల బాగా తీసాడు. పోస్టర్‌ బాగుంది సినిమా కూడా బాగుంటుంది అందరికి శుభాకాంక్షలు అన్నారు.


దర్శకుడు రమా కె శ్రీనివాస మాట్లాడుతూ..నాకు సినీ  జీవితాన్ని ప్రసాదించిన మా గురువు తమ్మారెడ్డి భరద్వాజ గారు నా సినిమా పోస్టర్‌ ని విడుదల చేయటం నేను మర్చిపోలేని సంఘటన.ఇదొక లవ్‌ 


మరియు థ్రిల్లర్‌ స్టోరీ పోస్‌‌ట ప్రొడక్షన్‌‌స పనులు పూర్తి అయ్యాయి త్వరలో సెన్సార్‌ కు పంపుతున్నాము 


ఉగాది తర్వాత పాటలు విడుదల చేసి సినిమా రిలీజ్‌ డేట్‌ ని అనౌన్‌‌స చేస్తాం అన్నారు.డి.ఓ.పి లక్కీ ఏకారి మాట్లాడుతూ ..మంచి లొకేషన్‌‌స లో సినిమా తీసాము అందరికి తప్పకుండ నచుతుంది అన్నారు.


సంగీత దర్శకుల్లో ఒకరయిన షణ్ముఖ్‌ మాట్లాడుతూ ..మొత్తం నాలుగు పాటలు ఉంటాయి.సింగర్‌‌స అందరు కొత్తవాళ్లే చక్కగా పాడారు.లిరిక్‌ రైటర్‌‌స ని కూడా కొత్తవాళ్లను తీసుకున్నాం అన్ని పాటలు చాల బాగా వచ్చాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com