ఉగాది పర్వదినాన్ని పురస్క రించుకొని మార్చి 31న కారులో షికారు కెళితే చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ద ర్శకులు మాదాల కోటేశ్వర్ రావు. ధీరూ మహేష్ ,సుద ర్శన్, ప్రియాంక, ఇషికా సింగ్, జీవా తదితరులు నటించిన హరర్ థ్రిల్లర్ ని శ్రీ హరిహర ఫిల్మ్స పతాకంపై మధు, అనీష్ , అభిరాం లు సంయుక్తంగా నిర్మించారు . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ '' మీనాక్షి భుజంగ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది , పాటలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా అందరినీ అలరిస్తాయని ఇక చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా మా సినిమాకు మరింత అందాన్ని ఇచ్చిందని ...... మా కారులో షికారుకెళితే తప్పకుండా యూత్ అందరినీ ఆకట్టుకుంటుందని, హరర్ తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించామని '' సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేసాడు . ఇంత కుముందు గులాబీ వంటి సామజిక ఇతివృత్తం గల చిత్రాన్ని చేసి ప్రశంసలు అందుకున్న మాదాల కోటేశ్వర్ రావు కమర్షియల్ సక్సెస్ కోసం హరర్ బాట పట్టాడు చిత్ర నిర్మాతలు మధు , అనీష్ , అభిరాం లు మాట్లాడుతూ మిత్రుడు కోటేశ్వర్ రావు చెప్పిన కథ నచ్చడంతో కేవలం అతడి పై నమ్మకంతో ఈ చిత్రా న్ని నిర్మించాం . హరర్ నేపథ్యంలో రూపొందిన మా కారులో షికారుకెళితే చిత్రం తప్పకుండా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , అందుకే ఎన్ని చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ మా సినిమాని ఈనెల 31న రిలీజ్ చేస్తున్నామని అన్నారు .