ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డా.రెడ్డీస్‌ ప్లాంట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 12:48 AM

హైదరాబాద్‌: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ప్లాంట్‌ లో  అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ)  తనిఖీలు  మొదలుకానున్నాయి.  సంస్థకు చాలా కీలకమైన శ్రీకాకుళం ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ  ఈ నెలాఖరున తనిఖీలు చేపట్టనుంది.  మార్చి 27 న ఈ తనిఖీలు  ప్రారంభం కానున్నాయి.  ఈమేరకు అమెరికా డ్రగ్‌ రె గ్యులేటరీ మీడియా కు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ లో  శ్రీకాకుళం ప్లాంట్‌ సక్రియాత్మక ఔషధ అంశాల () సరఫరా పరంగా చాలా కీలకం. ఫిబ్రవరి- మార్చి 2017లో మిర్యాల గూడ ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ 3 లోపాలు(అబ్జర్వేషన్స్‌) నమోదు చేసింది. ఇక విశాఖకు దగ్గర్లోగల దువ్వాడ ప్లాంటు తనిఖీల్లో భాగంగా 13 అబ్జర్వేషన్స్‌ నోట్‌ చేసింది. ఈ నేపథ్యంలోనే   ఈ తనిఖీలుచేపట్టనుంది.  నవంబర్‌ 2015 లో ఈ మూడు ప్లాంట్లపైనా యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ  డ్రగ్‌మేకర్‌  చిక్కుల్లోపడింది.  కాగా కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ మూడు ప్లాంట్ల వాటా 10-12 శాతంగా   ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com