ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ మారిన మాజీలకు కష్టకాలం?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:24 AM

  -నాడు కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగిన బసవరాజ్‌ సారయ్య


  -ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్‌


  -రాజకీయాల నుండి కనుమరుగైన సారన్న


  -సొంత వ్యాపారాలేక పరిమితం అరుున మాజీమంత్రి


  -తన నియోజకవర్గానిేక రెడ్యానాయక్‌ పరిమితం


  -అయోమయంలో కూతురు కవిత భవితవ్యం


మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః రాజకీయాలలో ఎపుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమైన పని అంటారు విశ్లేషకులు. నిన్నటి వరకు మంది మార్బ లంతో వేల మంది అనుచరులు చుట్టు పోలీసులతో అధికారాన్ని చెలాయించిన ఇద్దరు నేతలు ఇపుడు సైలెంట్‌ అయిపోయారు. వరంగల్‌ జిల్లా రాజకీయాలలో తమకంటూ ఓ ముద్రను వేసుకున్న ఈ ఇద్దరు సీనియర్‌నేతలు బసవరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లు ప్రాధాన్యత లేక కొట్టు మిట్టా డుతున్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సారయ్య వరం గల్‌ నగ రంపై తనదైన ముద్రవేశారు. ఇరవై సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా మూడేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికలలో కొండా సురే ఖ చేతిలో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. ఓడిపో యినప్పటి నుండి కాంగ్రెస్‌ పార్టీలో కాస్తా ఇబ్బందిగానే కొనసాగుతున్నారు. అయినప్పటికి కాంగ్ర ెస్‌ అధి ష్ఠానం ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్‌ పార్టీతో సుదీ ర్ఘకాల అనుబందం కలిగిన ఆయనను తెలంగాణ ఉద్యమ సమయంలో కాం గ్రెస్‌ ప్రజాప్రతినిధుల ఫోరం ఛైర్మన్‌ను చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఆయన గడిచిన కార్పోరేషన్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. ఆ సమయంలో ఈయన అనుచరులు ఎవ్వరు కూడ ఆయన వెంట నడవలేదు. వారంతా కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. సారయ్య పార్టీ మారిన తరువాత జరిగిన ఎన్నికలలో వరంగల్‌ తూర్పులో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క కార్పోరేటర్‌ను కూడ గెలవలేకపోయింది. అయితే కాంగ్రెస్‌కు కొంత మేర నష్టం కలిగిన సారయ్యకు మాత్రం ఏం లాభం లేకుండా పోయింది. పార్టీ మారినప్పటి నుండి టిఆర్‌ఎస్‌లో ప్రాధాన్యం దక్కక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం మంత్రుల అపాయింట్‌ మెంట్‌ కూడ లబించడం లేదని ఆయన లోలోన మథ నపడుతున్నారు. ఈ విషయం బయటకు ఎవ్వరికి చెప్పుకోలేక టిఆర్‌ఎస్‌లో ఇమడలేక బయటకు రాలేక తనలో తాను కుమిలిపోతున్నారని ఆయన అను చరులు అంటున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన పార్టీ మారే వారి జాబితాలో అగ్రస్థానంలో ఉంటారన్న ప్రచారం జరుగుతుంది. 


రెడ్యా నాయక్‌ది విచిత్ర పరిస్థితి


సీనియర్‌ గిరిజన ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయన డోర్నకల్‌ నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలు పొందారు. డా వైఎస్‌ఆర్‌ హయాంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. గడిచిన ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం సాదించారు. ఎన్నికలు ముగిసి టిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో వెంటనే ఆ పార్టీలోకి జంప్‌ చేశారు. ప్రస్తుత అసెంబ్లీలో ఆయన సీనియర్‌ గిరిజన ఎమ్మె ల్యే. ఎన్నికలకు ముందు పార్టీ మారి పోటీ చేస్తే కెసిఆర్‌ క్యాబినేట్లో మంత్రిగా ఉండేవాడినని బాధపడుతున్న రెడ్యానాయక్‌ ఇపుడు ఏం చేయలేక తన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. తన కూతురు కవిత మానుకోట నుండి పోటీచేసి ఓటమి పాలైనప్పటికి మాజీ  ఎమ్మెల్యేగా పార్టీ అధిష్ఠానం ఆమెకు మంచి గుర్తింపునిస్తుంది. కానీ రెడ్యా వరకు వచ్చాక మాత్రం ఎక్కడో తేడా కనిపిస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు. నేరుగా సోనియాగాంధీతో సత్సంబందాలు కలిగిన రెడ్యానాయక్‌కు కెసిఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడ లబించడం లేదని టిఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. సౌమ్యుడిగా, వివాద రహితుడిగా పేరున్నప్పటికి పార్టీ మారిన ఎమ్మెల్యేగా ఇంతకంటే ఎక్కువ గుర్తిం పు ఇవ్వడం సాద్యం కాదని టిఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి కావాల్సిన పనులను సాదించుకోవడంలో ఈ గిరిజన ఎమ్మెల్యే ముందు వరసలోనే ఉంటున్నారు. కానీ తనకు పదవులు తెచ్చుకోవడంలో మాత్రం వెనకంజ వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సమ యంలో మహబూబాబాద్‌ ప్రాంతం మొత్తం ఆయన గుప్పిట్లోనే ఉండేది. కానీ ఇపుడు కేవలం డోర్నకల్‌ నియోజకవర్గానికి పరిమితమయ్యారన్న గుసగుసలు ఆయన అనుచరుల నుండి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయాలలో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదనే పెద్దలు అనే నానుడి వీరిద్దరిలో అక్షరాల నిజమైంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com