ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:48 AM

విజయవాడ, సూర్య బ్యూరో : ప్రతి ఒక్కరు కష్టపడే తత్వాన్ని అలవర్చుకున్నప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రాష్ర్ట సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏ-ప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్‌) ప్లీనరీ2017 కార్యక్రమం ఫోరమ్‌ అధ్యక్షుడు చెవుల కష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మారెళ్ల వంశీకష్ణల ఆధ్వర్యంలో జరిగింది. సుమారు 5,127 మంది జర్నలిస్టులు ఎపి విభజనానంతరం ఒకే వేదిక మీద నిలబడటం ఒక చర్త్రిగా గుర్తించి ప్రపంచంలో ఒక రికార్డును సాధించడం ఒక విశేషం. ఈ సందర్భంగా రాష్ర్ట అధ్యక్షులు చెవుల కష్ణాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మారెళ్ల వంశీకష్ణలు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమ నిధికి రాష్ర్ట ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులను ప్రకటించాలని, ఈ సంక్షేమ నిధి ద్వారా సీనియర్‌ జర్నలిస్టులకు పెన్షన్‌, రూ.10 లక్షల భీమా పథకం ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టులకు, సాధారణంగా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సైతం రూ.5 లక్షల వంతున, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు, పక్కాగహాల నిర్మాణం, జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించే విధంగా రాష్ర్ట ప్రభుత్వాన్ని ఈ ప్లీనరీ వేదికగా చేసుకొని కోరగా, హాజరైన వారందరూ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి జర్నలిస్టులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. జర్నలిస్టుల ఐక్యతకు ఈ ప్లీనరీ ఓ నిదర్శనమన్నారు. ఈ సందర్బంగా హాజరైన మంత్రి పల్లె మాట్లాడుతూ ఇప్పటికే రాష్ర్టంలో 15 వేల మంది జర్నలిస్టులకు, డెస్క్‌లో పనిచేసే వ్యక్తులకు ఆక్రిడిటేషన్లు మంజూరు చేసామన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ తప్పనిసరిగా మంజూరు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని, ఇందులో మరో మాటకు అవకాశం లేదని మంత్రి ఉద్ఘాటించారు. జర్నలిస్టులకు హెల్త్‌ కార్డ్‌‌సతో ఉచిత వైద్యం అన్ని ఆసుప్త్రుల్లో అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ర్టంలో అక్రిడిటేషన్‌ కల్గిన ప్రతి పాత్రికేయుడికి రూ.10 లక్షల సమగ్ర ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందుకోసం కేవలం రూ.15లతో ప్రతి జర్నలిస్టుకు చంద్రన్న బీమా సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ర్టంలో ఉన్న పాత్రికేయులకు స్థానికంగా ఇంటి పట్టాతో పాటు, పక్కా గహం మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలో ఏ రాష్ర్టంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టులకు మెరుగైన వసతులు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. సీనియర్‌ జర్నలిస్టులకు ప్రతి నెల పెన్షన్‌ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. సమాజ శ్రేయస్సులో పాత్రికేయులు నీతి, నిజాయితీలతో కూడి వార్తలను అందించే సామాజిక బాధ్యతను అందిపుచ్చుకోవాలన్నారు. జర్నలిస్టులకు మెరుగైన వసతుల కల్పనకు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధి విధానాలను అధ్యయనం చేయాలని రాష్ర్ట సమాచార, పౌరసంబంధాల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించామన్నారు. రాష్ర్టంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఉపేక్షించమని, అటువంటి దోషూలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ర్టంలో పాత్రికేయుల పిల్లలకు అన్ని కార్పోరేట్‌ స్కూల్‌ లో ఉచిత విద్య అమలకు చర్యలు తీసుకుంటామని, సంబంధిత యాజమాన్యాలతో సంప్రదింపులు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి చెప్పారు. అనంతరం ఏపీజేఎఫ్‌ ప్లీనరీకి హాజరైన పాత్రికేయ మి్త్రులతో కలిసి విందులో పాల్గొన్నారు. పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటికి పరిష్కారాన్ని చూపించడంలో జర్నలిస్ట్‌ సంఘాల అవశ్యకత ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. విజయవాడ ఎ ప్లస్‌ కన్వెన్‌షన్‌ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్ట్‌ ఫోరం ఏర్పాటు చేసి ప్లీనరీలో పాల్గొన్నారు. అనంతరం స్పీకర్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న మూడు మూల స్తంభాలలో నాలుగవ స్తంభమైన ప్రెస్‌ సమాజ వికాసానికి తోడ్పడుతుందన్నారు. ప్రజలకు సమాచారాన్ని అందించడంలో జర్నలిస్ట్‌ల ప్త్రా ఎంతో ఉందన్నారు. ప్రభుత్వం డెస్క్‌లో పనిచేసే సబ్‌ఎడిటర్లకు ఆక్రిడేషన్లు, ఇన్యూరెస్స్‌ కార్డులు తదితరమైన సౌకర్యాలు పెద్ద ఎత్తున కల్పిస్తుందన్నారు. పాత్రికేయుల రాసే వార్తలు సమాజంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని, అందుకే జర్నలిస్ట్‌లు వార్తను వార్తగా రాసేందుకు ప్రయత్నిస్తే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. జిల్లాలో, గ్రామాలలో పనిచేసే విలేకరులు చాలా కష్టనష్టాలు ఎదురుకుంటారని ఉపముఖ్యమంత్రి, ెంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప తెలిపారు. వార్తలు రాసేటపడు  పాత్రికేయులకు చాలా ఛాలెంజెస్‌ ఎదురవుతాయని, అయినా చాకచక్యంగా వార్తలను మలుస్తారన్నారు. రాష్ట్ర స్ధాయిలో జర్నలిస్ట్‌ల మీద దాడి జరిగినపడు యాక్షన్‌ తీసుకోవడానికి హైపవర్‌ కమీటి వేశామన్నారు. అలాగే జిల్లాలో జిల్లా స్ధాయి కమీటీలు వేస్తామని తెలిపారు. జర్నలిస్ట్‌లపై దాడులు జరగకుండా చూస్తామని, ఒకవేళ జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాస్తవాలను వెలికితీసేలా వార్తలు రాయాలని, అలాంటి వార్తలకు ప్రాముఖ్యం ఉంటుందన్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్ట్‌లకు నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాత్రికేయులకు స్ధానికంగా ఇంటి పట్టాతో పాటు గృహం మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినీయర్‌ జర్నలిస్ట్‌లకు ప్రతినెల పెన్షన్‌ సౌకర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులను ఉపేక్షించమని, వాటిపై కఠిన చర్యల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పాత్రికేయుల పిల్లలకు అన్ని కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఉచిత విద్య అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. జర్నలిస్ట్‌లు కష్టపడే తత్వాన్ని అలవరచుకున్నపడే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని చెప్పారు. రవాణాశాఖ మంత్రి శిద్దారాఘవరావు మాట్లాడుతూ భవిష్యత్తులో జర్నలిస్ట్‌లకు అన్ని విధాల ప్రభుత్వ సహాయసహాకారాలు అందిస్తుందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లడంలో జర్నలిస్ట్‌ల ప్త్రా ఉందని తెలిపారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం కృషి తమ సహాయసహాకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ, ఎస్‌.సి, కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపిడి ప్రభాకర్‌ తదితరులు పలువురు జర్నలిస్టు ప్రముఖులు, పాత్రికేయులతోపాటు రాష్ర్టంలోని 13 జిల్లాలకు చెందిన ఏపీజేఎఫ్‌ రాష్ర్ట, జిల్లా, నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వేలాదిగా జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com