ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌కు పరీక్ష!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 02:20 AM

  -సీరీస్‌ ఫలితాన్ని నిర్ధేశించే ఆఖరు మ్యాచ్‌కి ఇద్ధమైన ఇరుజట్లు


  -తీవ్ర ఒత్తిడిలో టీమిండియా


  -గెలుపే లక్ష్యంగా ఆసీస్‌ అడుగులు


  -డిఫెన్స్‌లో కోహ్లీ ఫిట్‌నెస్‌


  -ధర్మశాల వేదికగా నాలుగో టెస్టు


  -నేటి ఉదయం 9.30 గం.కు మ్యాచ్‌


ధర్మశాల : తాను నాయకత్వ బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి  భారత జట్టును ఎదురులేని శక్తిగా తీర్చిదిద్గిన కో హ్లీ ఆసీస్‌తో సీరీస్‌లో మా త్రం ఎత్తుపల్లాలను ఎదుర్కొంటున్నాడు. తాను నిలకడలేమీతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న కోహ్లీ జట్టుకు విజయం కూ డా అంత సులువుగా దక్కడం లేదు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో చెరో విజ యం కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా-భారత జట్లు ఓ మ్యాచ్‌ని డ్రాగా ముగించి ఆఖరు మ్యాచ్‌కి వన్నె తెచ్చా యి. సీరీస్‌ ఫలితం తేల్చనున్న ఈ ఆఖరు మ్యాచ్‌ విజయంపై ఇరుజట్ల ధీమాగా ఉన్నాయి. ఇప్పటికే సొంతగడ్డపై సీరీస్‌ కావడం ఆసీస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం భారత్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుండగా... మరోవైపు కోహ్లీ ఫిట్‌నెస్‌ ప్రశ్నార్ధకంలో పడేస్తోంది. అందుకు ఏ మాత్రం తక్కువ తినని ఆసీస్‌ కూడా ఆఖరు టెస్టు విజయం పట్ల పట్టుదలతో ఉన్నప్పటికీ భారత్‌ ఏ క్షణానై్ననా  విరుచుకుపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గవాస్కర్‌-బోర్డర్‌ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి ధర్మశాలో ఆరంభం కానుంది. ఉదయం గం.9.30 ని.లకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ గెలిస్తే, బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించింది. ఇక రాంచీలో ముగిసిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ను విజయం ఊరించినప్పటికీ చివరకు డ్రాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ తరుణంలో సిరీస్‌ ఫలితం కోసం ధర్మశాల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఆ రికార్డును సవరిస్తారా?


ఇదిలా ఉంచితే, ఈ వేదికపై జరిగిన ఆరంభపు వన్డే, టీ20 మ్యాచ్‌లో భారత్‌ జట్టు ఓటమి పాలైంది. ఈ వేదికకు అంతర్జాతీయ హోదా వచ్చిన తరువాత 2013లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో పరా జయం చెందింది. ఆ తరువాత 2015లో ఇక్కడ జరిగిన తొలి టీ20లో సైతం భారత్‌కు నిరాశే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఆతిథ్యమిచ్చే 27వ టెస్టు వేదికైన ఈ స్టేడియంలో విరాట్‌ సేనకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. మ రి ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెస్టు గెలిచి రికార్డును భారత్‌ సవరిస్తుందా?లేక ఓటమి పాలై పాత కథనే పునరావౄఎతం అనే దానిపై ఆసక్తి ఏర్పడింది. మరొకవైపు ఇక్కడ సాధారణంగానే బౌన్సీ వికెట్‌కు అనుకూలం కావడంతో  ఆసీస్‌ బౌలర్లు విజృంభించే అవకాశం ఉంది. అదే సమయంలో భారత జట్టు కూడా పేస్‌ బౌలింగ్‌లో పటిష్టంగానే ఉంది. ఈ క్రమంలోనే తుది టెస్టులో ఐదు గురు బౌలర్లతో బరిలోకి దిగి తమ బలాన్ని మరింత పెంచుకోవాలని భార త్‌ భావిస్తోంది. ఇదే జరిగితే కొన్ని రోజుల క్రితం టెస్టు జట్టులో చేరిన మొహ్మద్‌ షమీ తుది జట్టులో కచ్చితంగా ఉంటాడు.


ప్రతీకారం తీర్చుకునేనా..?


ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన గవాస్కర్‌-బోర్డర్‌ ట్రోఫీని ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. 2014-15 సీజన్‌లో స్వదేశంలో జరిగిన ట్రోఫీని ఆసీస్‌ 2-0తో సొంతం చేసుకుంది. మైకేల్‌ క్లార్క్‌ నేతౄఎత్వంలోని ఆసీస్‌ జట్టు తొలి రెండు టెస్టులను గెలిచి సిరీస్‌ ను ఎగరేసుకుపోయింది. ఆ సిరీస్‌ లో స్టీవ్‌ స్మిత్‌ (769) అత్యధిక పరుగులు చేసి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరి ఇప్పుడు జరుగుతున్న సిరీస్‌ ను భారత్‌ గెలుచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరొకవైపు భారత్‌ ను ఒత్తిడిలో నెట్టి సిరీస్‌ ను సొంతం చేసుకోవాలని ఆసీస్‌ యోచనగా ఉంది. దాంతో మరొకసారి రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com