తాజాగా జరిగిన జీ సినిమా అవార్డ్స్ 2017 వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అవార్డు ని గెలుచుకున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలు ఘన విజయం సాధించినందుకు గాను ఈ అవార్డు దక్కినట్టు తెలుస్తుంది. ఇక గ్లామర్ బ్యూటీ సమంత కూడా అవార్డు అందుకుంది. ఇక నేచురల్ స్టార్ నాని గోల్డెన్ స్టార్ అవార్డు అందుకోగా,రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ స్టార్ అవార్డు గెలుచుంది. సౌత్ స్టార్ హీరో సూర్య సౌత్ సెన్సేషనల్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. నీరజ కోన స్టైలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. ఈ క్రమంలో తారలు తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయాలు సాధించడం లో తమను ఇంతగా ప్రోత్సాహించిన డైరెక్టర్స్ కి ఎన్టీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులో కూడా అభిమానులను ఎంటైర్ టైన్ చేయడానికి ఇలాగే కృషి చేస్తానని, ఛాలెంజింగ్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటానని తెలిపాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో తారల సందడి అభిమానులకు కనుల విందుగా మారింది.