ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలి’ పెళ్లిని తలపించేలా తెలంగాణలో ఖరీదైన పెళ్లి!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 02:09 PM

మొన్నటి వరకు అందరూ గాలి జనార్ధన్‌రెడ్డి కూతురి పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు మరో ఖరీదైన పెళ్లి తెరపైకొచ్చింది. అది కూడా తెలంగాణలో. వెడ్డింగ్ కార్డులో వీడియో పెట్టడం ద్వారా గాలి జనార్ధన్‌రెడ్డి తన కూతురు పెళ్లి విషయంలో వార్తల్లోకెక్కారు. వివాహ ఆహ్వాన పత్రికలో వీడియోనా? అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. ఇప్పుడు వీడియో కాదు.. ఏకంగా పెళ్లికి వేసుకురావాల్సిన దుస్తులే పెట్టారు. అంతేకాకుండా వాటితో పాటు ఓ కడియం కూడా ఇస్తున్నారు. అందుకే ఈ పెళ్లిని తెలంగాణలో అత్యంత ఖరీదైన పెళ్లిలా భావిస్తున్నారు. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిదనేగా మీ డౌటు?..తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, కేసీఆర్ వెన్నంటే ఉన్న రాములు నాయక్‌కు ఎమ్మెల్సీగా పట్టం కట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ హోదాలో ప్రజాప్రతినిధిగా ఉన్న రాములు నాయక్ తన మూడో కుమారుడైన జితేంద్రనాయక్‌కు త్వరలో వివాహం చేయబోతున్నారు. అందరిలాగే తానూ చేస్తే గుర్తింపు ఏముంటుందనుకున్నారో ఏమో ఇలా వెరైటీగా ప్లాన్ చేశారు. అతిథులందరికీ ఆహ్వానపత్రికలోనే పెళ్లికి వేసుకురావాల్సిన దుస్తులు కూడా అందిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ పింక్ పైజామా, రెడ్ బాటమ్‌తో పాటు లాల్చీను గిఫ్ట్‌గా ఇస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్సీలందరి కొలతలను రాములు నాయక్ ముందుగానే తీసుకున్నారట. దుస్తులంతో పాటు ఓ వెండి కడియం కూడా ఆహ్వానపత్రికలో ఉంది. అతిథులందరూ గులాబీ డ్రెస్‌లు వేసుకుని పెళ్లిలో గంభీరంగా తిరుగుతుంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com