ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోని ఇండియా నుంచి ఫాస్టెస్ట్ ఎస్డీ కార్డు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 07:01 PM

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్డీ కార్డు లాంచ్ అయింది. సోని ఇండియా ఎస్ఎఫ్-జీ సిరీస్ లో దీన్ని లాంచ్ చేసింది. ప్రొఫిషినల్ ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్ల కోసం స్పెషల్ గా దీన్ని డిజైన్ చేశారు. మూడు వేరియంట్లలో  ఈ కార్డును లాంచ్ చేశారు. ఎస్ఎఫ్‌-జీ32/టీ1(32కెపాసిటీ) ధర రూ. 6700 కాగ, 64జీబీ కెపాసిటీ ఎస్ఎఫ్-జీ64/టీ1 ఐఎన్ కార్డు ధర రూ.11,000. 128జీబీ కెపాసిటీ కార్డు ధర రూ.19,9000. ఈ కార్డులన్ని ఐదేళ్ల వారెంటీతో ఏప్రిల్ 3 నుంచి వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. ఈ ఎస్డీ కార్డు రైటింగ్ స్పీడు సెకనుకు 299 ఎంబీపీఎస్ వరకు  ఉంటుంది. అదేవిధంగా రీడింగ్ స్పీడు కూడా సెకనుకు 300ఎంబీపీఎస్ వరకు ఉంది. డిజిటల్ ఇమేజింగ్ డివైజ్లన్నింటికీ తమ ఎస్ఎఫ్-జీ సిరీస్ కార్డులు సపోర్టు చేస్తాయని సోని తెలిపింది. డీఎస్ఎల్ఆర్తో 4వేల వీడియోలను ఇది రికార్డు చేస్తోంది. ఈ కొత్త ఎస్డీ కార్డుతో పాటు ఎస్డీ మెమరీ కార్డు రీడర్ ను కూడా కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటితో డేటాను చాలా వేగంగా.. పర్సనల్ కంప్యూటర్లోకి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com