హైదరాబాద్: ఐఫా ఉత్సవాలకు సినీ తారలంతా హాజరై ఉత్సవానికి మరింత సొబగులద్దారు. ఆద్యంతం తారల సందడి నడుమ చూస్తున్న వారికి కన్నుల పండువగా సాగింది. కార్యక్రమానికి నాగార్జున, అమల జంట స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన ఫేవరెట్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు రావడం తనకెంతో ఆనందదాయకంగా ఉందని నాగ్ తెలిపారు. అఖిల్ పెర్ఫార్మెన్స్ ఉందని.. అది తనకు అక్కడికొచ్చాకే తెలిసిందని నవ్వుతూ చెప్పారు.