న్యూఢిల్లీ : నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులను తమ దేశంలోకి అనుమతించే విషయంలో కాస్త విశాల హృదయంతో ఆలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికాను కోరారు. 'అమెరికా ఫస్ట్' అన్న డోనాల్డ్ ట్రంప్ విధానాలు, హెచ్1బి వీసాల సంఖ్యపై వేటు.. తదితర పరిణామాల నేపథ్యంలో మోదీ ఈ అంశంపై స్పందించారు. హెచ్1బి వీసాలను తగ్గిస్తే.. 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ సేవల పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. ప్రధానంగా అమెరికాకు సాఫ్ట్‌వేర్ ఎగుమతుల మీదే ఈ పరిశ్రమ ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa