ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర్యాలీ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు : పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 09:17 AM

టీజెఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాం ని పోలీసులు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో సికింద్రాబాద్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో బాటు ఐకాసకు చెందిన మరో 50 మంది నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. 12 వేలమంది పోలీసులతో సిటీని దాదాపు అష్ట దిగ్బంధనం చేయగా ఎక్కడ పడితే అక్కడ పోలీసులతో నగరంలో ఉద్విగ్న వాతావరణం కనిపించింది. టీజెఏసీ నిర్వహించ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని ఐకాస నేతలు ఆరోపిస్తున్నారు. అటు ఉస్మానియా యూనివర్సిటీ, ఇందిరా పార్క్, సుందరయ్య విజ్ఞానకేంద్రం వంటివాటిని పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు. కోదండ రాం ని అరెస్టు చేసిన ఖాకీలు ఆయనను ఎక్కడికి తరలించారో తెలియలేదు. ఈ ర్యాలీకి అనుమతి లేదని, దీన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.


ko










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa