చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తన అభిమానులను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల మెరీనా బీచ్‌లో నిర్వహించిన జల్లికట్టు ఆందోళనకు సంబంధం ఉందంటూ సుధాగర్ అనే వ్యక్తిని, కమల్‌హాసన్ రసిగరల్ నర్పని ఇయక్కం సంఘానికి చెందిన కొంతమంది సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యపై కమల్ బుధవారం ట్వీట్ చేశారు. ‘ఇక నేను ట్వీట్లు తగ్గించి, మౌనంగా ఉండాలనుకుంటున్నా ప్రజల న్యాయం దేశాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా. నిన్న సుధాగర్‌ని, ఇయక్కం ఆర్గనైజేషన్‌కు చెందిన కొంతమందిని జల్లికట్టు ఆందోళనకారులుగా పోలీసులు అరెస్టు చేశారు. దీనివల్ల మా ప్రతిష్ఠ పెరుగుతుంది. మాపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న విషయం బయటపడుతుంది. ఇప్పుడు మా ఇయక్కం సభ్యులు ఇంకా సహనం, హుందాతనంతో ఉండాలి’. ‘మీ అభిప్రాయాలు వినిపించడాన్ని కొనసాగించండి కానీ ఎక్కడా హద్దులు దాటకుండా చూసుకోండి. మన సిద్ధాంతాలను వదులుకోవాల్సిన పనిలేదు. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచినా ప్రజల సంక్షేమం కోసం పోరాడటమే మన పని. ప్రతిఫలం లేని ఈ బాధ్యతనూ ఎప్పటికీ కొనసాగిస్తాం. పాలకులు వస్తారు, పోతారు. కానీ దేశం శాశ్వతంగా ఉంటుంది’ అని కమల్ తమిళంలో ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa