హైదరాబాద్ : రెండువేల ఏండ్ల క్రితమే భౌతిక జీవిత సమస్యల పరిష్కారానికి ధర్మమార్గమే గొప్ప మార్గమని చాటిన బుద్ధుడి బోధనలపై చర్చాగోష్ఠి నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధమైంది. నేటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో బుద్ధిస్ట్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ-2017 పేరుతో సదస్సు జరుగనున్నది. రాష్ట్ర పర్యాటక, పురావస్తు, బుద్ధవనం ప్రాజెక్టు, భాషా, సాంస్కృతికశాఖల సమన్వయంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని బౌద్ధక్షేత్రాలు, తెలంగాణ బౌద్ధక్షేత్రాలు, గోదావరి తీరంలో బౌద్ధమతం పరిఢవిల్లిన తీరు, బుద్ధుడి జీవితకాలంలోనే బాదన్‌కుర్తిలో జరిగిన గొప్ప చర్చలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa