లండన్: బ్యాంక్‌లకు రూ.9,000 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడైన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరోసారి మీడియాలో సంచలనమయ్యారు. నివసిస్తున్న దేశం మాత్రమే మారింది ఆయన రాజసం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. బ్రిటన్ వెళ్లిన తర్వాత తొలిసారి ఆయన బహిరంగంగా కనిపించారు. బ్రిటన్ లో ఫార్ములా వన్ రేసుకు సంబంధించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ రేసులో ఆయనకు చెందిన 'సహారా ఫోర్స్ వన్' కూడా పాల్గొంటోంది. ఈ సందర్భంగా తన ఫార్ముల్ వన్ డ్రైవర్లు సెర్జియో పెరెజ్, ఈస్టెబాన్ లతో కలసి ఫొటోలు దిగారు. వీటిన ఫార్ములా వన్.కామ్‌లో అప్‌లోడు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa