హరీశ్‌రావు అవసరం కాంగ్రెస్‌కు లేదు : జగ్గారెడ్డి

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 01:13 AM
 

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: కాంగ్రెస్‌లో యోధాను యోధులు ఉన్నారు.. హరీశ్‌రావు అవ సరం లేదని, ఆయన కాంగ్రెస్‌లోకి వస్తే చిన్నవార వుతారని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. గురు వారం ఆయన మరో కాంగ్రెస్‌ నేత ఉమేశ్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో అంతర్గత పోరు వాస్తవమేనని అన్నారు. టీఆర్‌ ఎస్‌లో హరీశ్‌రావుది మొదటి నుంచి కీలక పాత్రే అని, వారసత్వ రాజకీయాల్లో హరీశ్‌రావు డౌన్‌ అయ్యారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. హరీశ్‌రావుకు టీఆర్‌ఎస్‌లో ఎప్పటికీ అవకాశాలు రావని ఆయన చెప్పారు. ’మంత్రి హరీశ్‌రావు మంచి నేత, కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుంది.. హరీశ్‌రావును కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని కాంగ్రెస్‌ నేత ఉమేశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టిందని, హరీశ్‌రావును టీఆర్‌ఎస్‌ పార్టీలో పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు. హరీశ్‌రావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి లాభం చేకూరుతుందని ఉమేశ్‌రావు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.