ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ నేపథ్యంలో రామ్‌చరణ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2017, 01:40 AM

పల్లెటూరి కుర్రాడిగా సందడి చేయబోతు న్నారు రామ్‌చరణ్‌. ఆ పాత్ర కోసం తన వేషధారణని పూర్తి స్థాయిలో మార్చుకొన్నారు. గుబురు గెడ్డం, తలకట్టుతో కొత్తగా కనిపిస్తున్నారు. చరణ్‌ ఇదివరకు చేసిన చిత్రాల్లోని పాత్రలతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంది ఆ వేషధారణ. సుకుమార్‌ దర్శకత్వం విహ స్తున్న చిత్రం కోసమే ఆ ప్రయత్నమంతా. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఆ చిత్రం ప్రస్తుతం కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపు కొంటోంది. రామ్‌ చరణ్‌, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల రామ్‌చరణ్‌, కథానాయిక సమంతపై ఓ గీతాన్ని కూడా చిత్రీకరించారు. కథ పల్లె టూరి నేపథ్యంలో సాగినా, ఇది ఫక్తు వాణిజ్య చిత్రంగా తెరకెక్కుతోందని, ప్రతీకార కథని దర్శకుడు సుకుమార్‌ తన శైలి కథనంతో తెరకెక్కి స్తున్నారని చిత్రవర్గాలు చెబు తున్నాయి. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయ కుడిగా నటిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com