టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 10:53 AM
 

హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఎన్నిక వివరాలను ప్రకటించిన సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు.