సభా ప్రాంగణానికి చేరుకున్న కేటీఆర్
Updated: Fri, Apr 21, 2017, 11:12 AM

హైదరాబాద్ : మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, జూపల్లి తదితరులు కూడా ప్లీనరీ వేదికపైకి చేరుకున్నారు. వీరంతా కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరి కొద్ది సేపటిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోనున్నారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కేసీఆర్ ఆనవాయితీగా అమర వీరులకు నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ ప్రారంభం అవుతుంది.

Telangana E-Paper