రాష్ట్రంలో రైతే రాజు కావాలి

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 02:37 PM
 

రాష్ట్రంలో రైతు రాజు కావాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. అందుకే దేశానికే దిక్సూచిగా ఉండేలా ఉచిత ఎరువుల పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎలాంటి పరిమితి లేకుండా ఎరువుల కోసం ప్రతి రైతుకు ఎకరాకు నాలుగువేలు అందిస్తామన్నారు. రెండు పంటలకు ఈ ఆర్థిక సాయం అందుతుందన్నారు. రైతుకు ఇచ్చే డబ్బులను ఎరువులతో పాటు పెట్టుబడికి కూడా ఉపయోగించుకోవచ్చన్నారు. ఈ పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంఘాల కోసం ఐదొందల కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని సీఎం తెలిపారు. రైతు సంఘాల ద్వారానే పంటల అమ్మకం కూడా జరిగేలా చూస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.