కోటి’ విరాళం ఇచ్చిన మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి
Updated: Fri, Apr 21, 2017, 05:07 PM

హైదరాబాద్ : మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సలీం, నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్ నాయకుడు తేర చిన్నప రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీకి భారీగా విరాళం ఇచ్చారు. మల్లారెడ్డి, సలీం రూ. కోటి చొప్పున, చిన్నప రెడ్డి రూ. 25 లక్షలు పార్టీకి విరాళం ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ముగ్గురు చెక్కులను రాజ్యసభ సభ్యులు కె. కేశవరావుకు అందజేశారు. ఎంపీ మల్లారెడ్డి కోటి రూపాయాలు పార్టీకి విరాళం ఇస్తున్నారని సీఎం ప్రకటించడంతో సభలో చప్పట్ల వర్షం కురిసింది. ఈ విరాళాలు టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ప్రకటించబడ్డాయి.

Telangana E-Paper