చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి బలనిరూపణ సందర్బంగా సభలో ఎంతటి గందరగోళం చోటు చేసుకుందో అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకె సభ్యులు అడుగడుగునా స్పీకర్ కు అడ్డుపడటంతో.. నానా గందరగోళం నడుమ పలుమార్లు వాయిదా వేస్తూ సభ నిర్వహించాల్సి వచ్చింది. డీఎంకె ఆందోళనలతో ఏకంగా ఆ పార్టీ సభ్యులందరిని మార్షల్స్ సహాయంతో బయటకు పంపించేసిన స్పీకర్.. మూజువాణి ఓటు ద్వారా పళనిస్వామి బలనిరూపణ పూర్తి చేశారు. అయితే అసెంబ్లీ నుంచి బయటకొచ్చిన డీఎంకె కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తన చిరిగిన చొక్కాను చూపిస్తూ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య అసలు సభలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన పలు నివేదికలను తెప్పించుకుని పరిశీలించారు. అయితే వాటి పట్ల సంతృప్తి చెందని గవర్నర్ మొత్తం ఘటనపై మరింత సమగ్రంగా వివరాలు కావాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa