మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశం చాలా సింపుల్ గా జరిగినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు సిరివెన్నెల సీతారామ శాస్త్రి దంపతులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాటల రచయితగా, దర్శకుడిగా ఎన్నో హిట్ చిత్రాలకు పని చేసిన త్రివిక్రమ్ ఇప్పటి వరకు రెంట్ హౌజ్ లోనే ఉన్నాడని అంటున్నారు. ఇన్నాళ్ళకు సొంత ఇల్లు నిర్మించుకున్నందుకు త్రివిక్రమ్ చాలా హ్యపీగా ఉన్నాడట. అయితే ఈ ఇల్లు ఎంత ఖర్చుతో, ఎక్కడ నిర్మించుకున్నాడు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆ మధ్య అ..ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ రామోజీ ఫిలిం సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.