ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 25, 2017, 05:05 PM

ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల ప్రారంభోత్సవం సహా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్‌లో రేపు (బుధవారం) వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లిస్తూ సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి, అక్కడ కార్యక్రమం తరువాత రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) కార్యక్రమానికి హాజరువుతారు. ఆ తర్వాత నేరుగా బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్రపతి ఈ రూట్లలో పర్యటించే నిర్ణీత సమయాలలో ఆంక్షలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు. వాహనాల మళ్లింపు, నిలిపివేయడాలు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సు రూట్‌ను మళ్లిస్తుండడంతో వాహ నదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ సూచించారు.


 


ట్రాఫిక్ మళ్లింపు, నిలిపివేసే రూట్లు, సమయాలివి:
బేగంపేట నుంచి ఉస్మానియా యూనివర్సిటీ:


 


మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 నిమిషాల మధ్య)
బేగంపేట ఎయిర్‌పోర్టు, బేగంపేట పోలీస్ స్టేషన్, రసూల్‌పురా జంక్షన్, పీజీ కాలేజీ, సీటీవో ఫ్లై ఓవర్, ప్లాజా, వైఎంసీఏ ఫ్లై ఓవర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, నాయుడు మోటర్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్ లేన్, ఆలుగడ్డ బావి జంక్షన్, ఎస్‌ఎన్‌టీ వర్క్ షాప్, మెట్టుగూడ జంక్షన్, రైల్వే డిగ్రీ కాలేజీ, తార్నాక ఎక్స్ రోడ్స్, ఆర్టీసీ దవాఖాన, ఉస్మానియా యూనివర్శిటీ.


 


ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్‌కు:
(మధ్యాహ్నం 1.15 నిమిషాల నుంచి 2 గంటల మధ్య)


ఉస్మానియా యూనివర్శిటీ, ఆర్టీసీ దవాఖాన, తార్నాక ఎక్స్ రోడ్స్, రైల్వే డిగ్రీ కాలేజీ, మెట్టుగూడ జంక్షన్, ఎస్‌ఎన్‌టీ వర్క్ షాప్, ఆలుగడ్డ బావి జంక్షన్, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, నాయుడు మోటర్స్ లేన్, సంగీత్ ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్, వైంఎసీఏ ఫ్లై ఓవర్, ప్లాజా, సీటీవో ఫ్లై ఓవర్, పీజీ కాలేజీ, రసూల్‌పురా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లై ఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్, బేగంపేట ఫ్లై ఓవర్, గ్రీన్ ల్యాండ్స్ ఎక్స్ రోడ్స్, మోనప్ప ఐలాండ్, జయ గార్డెన్, యశోద దవాఖాన, ఎంఎంటీఎస్, రాజ్‌భవన్ రైల్వే గేట్, రాజ్‌భవన్, వీవీ విగ్రహం.


 


రాజ్‌భవన్ నుంచి గచ్చిబౌలి:
(సాయంత్రం 4 గంటల నుంచి 4.45 నిమిషాల మధ్య)


మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం, కేసీపీ జంక్షన్, అన్సారీ మంజిల్, హోటల్ తాజ్ కృష్ణ టీ జంక్షన్, రోడ్డు నెం.1/10 జంక్షన్, రోడ్డు నెం. 1/12 జంక్షన్, ఖాజా మేన్షన్, మాసబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ, ఎస్.డీ.ఐ దవాఖాన, హుమాయున్‌నగర్ పీఎస్, రైతు బజార్, రేతి బౌలి, నాలానగర్, టోలిచౌకి ఫ్లై ఓవర్, గేలాక్సీ థియేటర్, షేక్‌పేట్ నాలా, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి.


 


గచ్చిబౌలి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు:
గచ్చిబౌలి, నారాయణమ్మ కాలేజీ, షేక్‌పేట్ నాలా, గేలాక్సీ థియేటర్, టోలిచౌకి ఫ్లై ఓవర్, నాలానగర్, రేతిబౌలి, మెహిదీపట్నం, ఎస్.డి.కంటి ఆసుపత్రి, ఎన్‌ఎండీసీ, మాసబ్ ట్యాంక్, ఖాజా మేన్షన్, రోడ్డు నంబర్ 1/12, రోడ్డు నంబర్ 1/10 జంక్షన్, హోటల్ తాజ్ కృష్ణ జంక్షన్, రోడ్డు నంబర్ 1/7 జంక్షన్, రోడ్డు నంబర్ 1/4 జంక్షన్, నాగార్జున సర్కిల్(ఎన్‌ఎఫ్‌సీఎల్), పంజాగుట్ట ఫ్లై ఓవర్, సీఎం క్యాంప్ ఆఫీస్, బేగంపేట ఫ్లై ఓవర్, హెచ్‌పీఎస్, శ్యాంలాల్, పీఎన్‌టీ జంక్షన్, బేగంపేట ఎయిర్‌పోర్టు, రసూల్‌పురా.


 


ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు:
-అడిక్‌మెట్ ఫ్లై ఓవర్, ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు సీతాఫల్ మండి టీ జంక్షన్ వద్ద సీతాఫల్‌మండి వైపు మళ్లిస్తారు.


 


-హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలను వీవీఐపీలు వచ్చే సందర్భంగా రాజ్యాభిలేఖ తార్నాక స్ట్రీట్ నంబర్ 1 వద్ద, లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను డేవిడ్ మెమోరియల్ స్కూల్ వద్ధ నిలిపివేస్తారు.


 


ఆర్టీసీ బస్సుల మళ్లింపు:
ఎన్‌సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మానియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు.


 


-ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్ (డీడీ ఆసుపత్రి) వద్ద ఉంటుంది.


 


-తార్నాక నుంచి వెళ్లే రూట్ నంబర్ 3 ఆర్టీసీ బస్సులు స్ట్రీట్ నంబర్ 8 హబ్సిగూడ, రామాంతపూర్, అంబర్‌పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్‌లో వెళ్లాలి.


 


-అఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్‌పేట్, రామాంతపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలి.


 


-దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు. ఈ బస్సులు హిందీ మహా విద్యాలయ, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్ రూట్‌లో నడుస్తాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com