హైదరాబాద్ మహానగరంలో పాపులేషన్ ఎలా పెరుగుతుందో వీధుల్లో కుక్కల సంఖ్య కూడా అందుకు తగ్గట్టే పెరుగుతోంది. ఏ గల్లీలో చూసినా స్ట్రీట్ డాగ్స్ గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. స్ట్రీట్ డాగ్స్ కూడా నగర ప్రజలకు ఒక సమస్యగా మారింది. కొన్ని చోట్ల అప్పుడప్పుడు పిచ్చికుక్కలు ప్రతాపం చూపిస్తున్నాయి. దీంతో హైదరాబాద్లో స్ట్రీట్ డాగ్స్ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ వినూత్నంగా ఆలోచించింది. దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న పద్ధతులు కాకుండా మానవతా దృక్పథంతో వీధికుక్కల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించింది.