ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రాన్స్‌ కొత్త అధ్యక్షుడిగా ఇమాన్యుయల్‌ మేక్రన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2017, 09:01 AM

ఫ్రాన్స్‌ నూతన అధ్యక్షుడిగా ఇమాన్యుయల్‌ మేక్రన్‌ ఎన్నికయ్యారు. ఎన్‌ మార్చ్‌ పార్టీకి చెందిన ఆయన నేషనల్‌ ఫ్రంట్‌కు చెందిన మారిన్‌ లీపెన్‌ పై విజయం సాధించారు. ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో మేక్రన్‌ కు 65.5 శాతం ఓట్లు వచ్చాయి.  39 యేండ్ల మేక్రన్..  ఫ్రాన్స్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న అతి పిన్నవయస్కుడిగా  సృష్టించారు. మేక్రన్ యూరప్, వాణిజ్య అనుకూల మధ్యేవాదికాగా,   లీ పెన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరే వలసల వ్యతిరేకి. లీ పెన్ తన ఓటమిని అంగీకరించారు. మేక్రన్ కు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 23న నిర్వహించిన ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ మెజారిటీ లభించకపోవడంతో అగ్రస్థానాన నిలిచిన ఈ ఇద్దరి కోసం ఆదివారం తిరిగి ఎన్నికలు జరిపారు. సోషలిస్టు పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేకు మరోసారి ఎన్నికల్లో పోటీచేసే అవకాశమున్నా అందుకు ఆయన నిరాకరించారు. రాజకీయ అనుభవం లేని మాజీ బ్యాంకర్ అయిన మేక్రన్ ఇప్పుడు సవాళ్ల నడుమ నిలిచిన దేశానికి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com