ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్టుల సంక్షేమానికి టిఆర్‌ఎస్‌ సర్కార్‌ కృషి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 14, 2017, 01:50 AM

 సిటీబ్యూరో, మేజర్‌న్యూస్‌ : భారతదేశంలోనే జర్నలిస్టుల సంక్షేమానికి విశేషంగా పాటుపడుతున్న రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ రాష్టమ్రే ఎంతో ముందుందని, జర్నలిస్టుల అభ్యున్నతికి సి.ఎం. కె.సి.ఆర్‌. పెద్దపీటం వేసి ఏకంగా వంద కోట్ల  రూపాయల బడ్జెట్‌ను ప్రెస్‌ అకాడమికి మంజూరు చేసిన ఘనత కూడా కేవలం సి.ఎం. కె.సి.ఆర్‌.కే దక్కిందని రాష్ట హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివార ం ఉదయం నాంపల్లి పబ్లి క్‌ గార్డెన్‌ హజ్‌ హౌజ్‌ ప్రక్కనగల రెడ్‌రోజ్‌ గార్డెన్‌లో ఏర్పాటుచేసిన తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్న లిస్ట్‌‌స హైదరాబాద్‌ జిల్లా ద్వితీయ మహాసభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకుల భవిష్యత్తు అంతా జర్నలిస్టులమీదే ఉందని, నాయకులను దించాలన్న, పైకి తీసుకురావాలన్నా జర్నలిస్టులది మేజర్‌ పాత్ర ఉంటుందని, తాను మీకు ఓ సోదరుడినని, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హిందూ-ముస్లీంల గొడవలు జరుగుతాయని, ఆంధ్ర వారిని ఇక్కడినుంచి తరిమివేస్తారంటూ అప్పట్లో సీమాంధ్రులు కేంద్రానికి తప్పుడు ప్రచారం చేసి, తెలంగాణను అడ్డుకోవడానిి  బురద చల్లారని ఆయన చెప్పారు. మూడు ఏళ్ళ సి.ఎం. కె.సి.ఆర్‌. పాలనలో సీమాంధ్రులు దుష్ర్పచారాలన్ని ఫటాపంచలయ్యవని, దేశంలోని 29 రాష్ట్ర్లాల్లోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ఎంతో దూసుకుపోతుం దన్నారు. పార్లమెంట్‌లో లగడపాటి రాజ్‌గోపాల్‌ ఎం.పి. కావాలనే తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి ఏకంగా స్పీకర్‌ పోడియంవద్దనే పేప్పర్‌ స్ప్రెను విసిరి తెలంగాణ మీదనున్న  తమ విషాన్ని వెళ్ళగక్కాడన్నారు. సి.ఎం. కె.సి.ఆర్‌.ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు పరుస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకంలో పెళ్ళి చేసుకునే యువతులకు గతంలో రూ. 51వేల నుంచి ఏకంగా రూ.75,116ల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెంచిందన్నారు. రైతులకు రుణమాఫీ పథకాన్ని కూడా అమలు చేసిన ఘనత కూడా సి.ఎం. కె.సి.ఆర్‌.కే దక్కిందని, మరో 10 ఏళ్ళపాటు సి.ఎం.గా కె.సి.ఆర్‌.యే ఉంటారని ఆయన జోస్యం పలికారు. సి.ఎం. ఇందిరాపార్కులోని ధర్నా చౌక్‌ను రద్దు చేస్తామని చెప్పలేదని, దీన్ని పనిపాటలేని  ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాజకీయం చేసి, తెలంగాణ సర్కార్‌ మీద బురద చల్లుతున్నారని, అయినప్పటికీ ప్రజలకు టి.ఆర్‌.ఎస్‌. పార్టీ మీద పూర్తి భరోసా ఉందని ఆయన చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సి.ఎం. కె.సి.ఆర్‌. సానుకూలంగా స్పందించారని, జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం మార్కెట్‌ యార్డులో ఆందోళనకు దిగితే, రైతులను  పోలీసులు అరెస్టుచేసి, బేడిలు వేశారని, దీన్ని ప్రతిపక్ష పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఏద్దేవా చేశారు. వాస్తవానికి  పోలీసులు పొరపాటున ఆందోళనకు దిగిన రైతుల చేతులకు బేడీలు వేశారని, అందుకు ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇద్దరు ఎస్‌.ఐ.లను సస్పెండ్‌ చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తుందని, జర్నలిస్టులు కూడా సి.ఎం. కె.సి.ఆర్‌. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు తమవంతు బాధ్యతగా పాటుపడాలని ఆయన సూచించారు. సి.ఎం. కె.సి.ఆర్‌. కలలు గంటున్న బంగారు తెలంగాణ సాధనకు జర్నలిస్టులు తమవంతు కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ పరిష్కరించేందుకు తనవంతు పాటుపడుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ప్రసంగిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి విశేషంగా పాటుపడుతున్న రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ముందుందని, అక్రిడిటెషన్‌ కార్డుల జారీలో కూడపా ఏలాంటి పక్షపాతం కనబర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు తక్కువ వచ్చేవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు ఈసారి కొత్తగా డెస్క్‌ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్‌ కార్డులు అందజేశామని ఆయన చెప్పారు. అర్బన్‌ ఏరియాల్లో కూడా కార్డులను అధికంగా ఇచ్చామని, జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు కూడా అందజేశామన్నారు. అక్రెడిటేషన్‌ లేని జర్నలిస్టులకు సైతం హెల్త్‌ కార్డులు ఇచ్చేందుకు తగిన చర్చలు జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు.  జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించిందని, ఇప్పటికే 68 కోట్ల రూపాయలు అకాడమిలో జమా అయ్యావని, వీటి ద్వారా వచ్చే వడ్డీ డబ్బులతో చనిపోయిన జర్నలిస్టుల బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ 13 ఏళ్ళ సుధీర్ఘ చరిత్రలో ప్రెస్‌ అకాడమి ద్వారా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, 29 రాష్టాల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏకంగా 100 కోట్ల నిధులను కేటాయించిన ఘనత కూడ టి.ఆర్‌.ఎస్‌. సర్కార్‌కే దక్కిందన్నారు. ఇందులో 68కోట్లు ఖాతాలో జమఅయ్యావని, వాటిద్వారా వచ్చే వడ్డీతో జర్నలిస్టుల బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయంతోపాటు మూడేళ్ళపాటు నెలకు రూ.3,000ల పెన్షన్‌నుకూడ అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. అకాడమికి, ప్రభుత్వానికి మధ్య సానుకూలమైన వాతావరణం ఉన్నందునే హెల్త్‌ కార్డులను పెద్ద సంఖ్యలో అందజేశామని, ఈ కార్డు కింద సుమారు 10 లక్షల వరకు వైద్య సేవలు అందించామన్నారు. ఆరు దశాబ్దాల చరిత్రలోనే ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని టి.ఆర్‌.ఎస్‌. సర్కార్‌ చేసిందన్నారు. రాంచంద్రమూర్తి ఆధ్వర్యంలో  ఏర్పాటు అయిన అక్రిడిటేషన్‌ కమిటీ ద్వారా రాష్ట్రంలో 16 వేల కార్డులను అందజేసిన ఘనత అకాడమికే దక్కిందన్నారు. గోపన్‌పల్లిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ సొసైటీ భూమిని స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, దీంతో స్టాఫర్లందరికి ఈ స్థలంలో ఇళ్ళ స్థలాలను కేటాయిస్తామన్నారు. నియోజకవర్గం స్థాయి రిపోర్టర్లకు నియోజకవర్గం ఎమ్మెల్యేలకు కేటాయించిన స్థలాల ప్రక్కనే స్థలాలు ఇళ్ళు నిర్మిస్తామని, మండల రిపోర్టర్లకు డబుల్‌బెడ్‌ రూంలు కేటాయించే విషయంలో ప్రభుత్వంతో తగిన చర్చలు జరుగుతున్నాయని  ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో జర్నలిస్టులకు స్థలాలు కేటాయించడంలో, డబుల్‌ బెడ్‌ రూంలు కేటాయించడంతో తన కోటా కింద జర్నలిస్టులకు ఎంతో అండగా నిలిచి వారికి పూర్తి సహకారం అందజేస్తా మన్నారు.  ఈ కార్యక్రమంలో టి.యు.డబ్ల్యు.జె. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లే రవికుమార్‌, రాష్ట్ర కోశాధికారి సామ్యూల్‌, మారుతి సాగర్‌, జిల్లా అధ్యక్షులు యోగానంద్‌, కార్యదర్శి పాలకుర్తి రాజు, మల్లేష్‌ గుప్తా, ఎం.వి. రమణ, జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సోసైటీ ప్రధాన కార్యదర్శి హాష్మీతోపాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com