మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్‌న్యూస్‌ః హర హర మహాదేవా...శంభో శంకర అంటూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని కీసరగుట్ట పరిసరాలన్ని మార్మోగిపోయ్యాయి. శుక్రవారం తెలవారు జామునుండే భక్తులు అత్యధిక సంఖ్యలో నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున్న కీసరగుట్టకు వచ్చేసి భారులు తీరి స్వామి వారి దర్శించుకొని మొక్కులు తీర్చు కున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా జిల్లా కలెక్టర్ యం.వి.రెడ్డి అదికార యంత్రాంగంతో ముందస్తుగా క్యూలైన్లు, మధ్యమధ్యలో భక్తులకు అవసరం నిమిత్తం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని ఆలయ ముఖద్వారం ముందున్న శివలింగాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు.
కనులపండుగలా శ్రీశివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామివార్ల కళ్యాణం
మహాశివరాత్ర బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కీసరగుట్టలో శ్రీశివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామివార్ల కళ్యాణం కనులపండుగలా ఆలయ చైర్మన్ తటాకం వెంకటేశ్‌శర్మ, ఈవో వెంకటేశంలు నిర్వహించారు. ప్రభుత్వ పరంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవంకు మేడ్చల్ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలను అందజేశారు.
జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ యం.వి.రెడ్డి
నూతన మేడ్చల్ జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న మహశివరాత్రి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలనే దృఢ సంకల్పంతో మేడ్చల్ కలెక్టర్ యం. వి.రెడ్డి జాతర పనులను దెగ్గరుండి నిరంతరం పర్యవేక్షీంచారు. చక్కటి ప్రణా ళికతో ముందుకుపోయిన కలెక్టర్ మహాశివరాత్రి పురస్కరించుకొని క్యూలైన్లను, పరిసరాలను పూర్తిగా పర్యవేక్షీస్తూ భక్తుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. భక్తులు కలెక్టర్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa