మహాదేవునికి భక్తజన నీరాజనం
4 లక్షలకు పైగా రాజన్నను దర్శించుకున్న భక్తులు
పట్టువస్త్రాలను సమర్పించిన టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం
శ్రీస్వామివారి దర్శనానికి 8 గంటలు
కరీంనగర్, సూర్య ప్రత్యేక ప్రతినిధి : దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఎన్నడూ లేని విధంగా జిల్లా అధికారులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు శ్రీస్వామివారిని దర్శించుకుని ఈ ఉత్సవాలను తిలకించడానికి విచ్చేశారు. గురువారం అర్ధరాత్రి రాత్రి వరకు దాదాపు 3లక్షలకు పైగా భక్తులు వేములవాడకు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు కూడా భక్తుల రాక తగ్గలేదు. అయితే ఇదే సమ యంలో పోలీసులు వేములవాడ పట్టణాన్ని కట్టుదిట్టమైన భద్రత నిర్వహించారు. బ్రిడ్జి అనంతరం ఆలయానికి నేరుగా వెళ్లే రహదారి వైపు స్థానికులతోపాటు భక్తుల వాహనాలను కూడా వెళ్లనివ్వలేదు. అంతేకాకుండా వేము లవాడలోకి చోరబడే వివిధ చిన్నచిన్న రహదారులన్నింటిని పోలీస్ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న రెండు బైపాస్ రోడ్డుల గుండా భక్తుల వాహనాలను జగిత్యాల, కోరుట్ల బస్‌స్టాఫ్‌ల వరకు మాత్రమే అనుమ తించడంతో భక్తులు దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు కాలినడకన నడిచి ఆలయానికి చేరుకోవాల్సి వచ్చింది. గురువారం ఉదయం నుండి రాత్రి వరకు చేరుకున్న భక్తు లు వెంటవెంటనే శ్రీస్వామివారిని దర్శించుకునేందుకు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి, ఆలయంలోని కోడె మొక్కును, శ్రీస్వామివారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లలో దాదాపు 8గంటలకు పైగా భక్తులు వేచి ఉన్నారు. ఇదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతోపాటు వివిఐపిలు, విఐపిలకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని ల్పించడంతో పలు మార్లు భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సివచ్చింది. గురు వారం అర్ధరాత్రి 12గంటల సమయంలో స్థానిక భక్తులకు శ్రీస్వామివారి దర్శన సౌకర్యాన్నికల్పించగా, వారు అర్ధరా తిర 10.30గంటల నుండే ధర్మగుండంలో స్నానాలు చేసి, క్యూలైన్లలో భారులు తీరారు. 12 గంటలకు వీరికి దర్శనా నికి అధికారులు అనుమతించడంతో కొద్దిపాటి తోపులా టలు చోటుచేసుకుని, ఆలయ అధికారులు, పోలీస్ బందో బస్తుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీరి దర్శ నం దాదాపు శుక్రవారం వేకువజాము 5 గంటల వరకు కొనసాగింది.
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఉచిత బస్సులు ఇబ్బందులు
వేములవాడకు విచ్చేసే భక్తులకు వేములవాడలోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు ఉచిత మినీబస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఈబస్సులు వేములవాడ తిప్పా పురంలోని ప్రధాన బస్‌స్టేషన్ నుండి జగిత్యాల, కోరుట్ల బస్టాఫ్‌లకు వెళ్లేందుకు ప్రత్యేకించి కేటాయించారు. కాని వీటిని కేవలం ఐదు మాత్రమే ఏర్పాటు చేశారు. దీనితో ఇవి పలు మార్లు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోగా, ఈ బస్సులు వచ్చిన భక్తులకు సరిపోక గంటల తరబడి బస్‌స్టేషన్‌లో నిలబడి పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా వేములవాడ పట్టణంలో ఆటోలను నియంత్రించడంతో పాటు యాత్రి కులు తీసుకువచ్చుకున్న కార్లు, వ్యాన్‌లు జీపులు, ఆటోలు సైతం మినీబస్సులు వెళ్లే ప్రాంతం గుండానే వెళ్లాల్సి వచ్చిం ది. పోలీసులు అడుగడుగునా బందోబస్తును నిర్వహించ డంతో పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ప్రాంతం నుండి ప్రధాన రహదారి వెంబడి శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం గుండా కేదారేశ్వరస్వామి ఆలయం వరకు పెద్దవాహనాల నుండి ద్విచక్రవాహనాల వరకు నియంత్రించారు.
కేటాయించని మినీ బస్సులు తగ్గిన ఆలయ ఆదాయం
భక్తుల సౌకర్యార్థం కేటాయించిన మినీబస్సులు అను బంధ ఆలయమైన శ్రీనాంపల్లి లక్ష్మినర్సింహ స్వామి ఆల యానికి వెళ్లేందుకు కేటాయించలేదు. వేములవాడకు చేరుకున్న భక్తులు శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించు కున్న అనంతరం నాంపల్లి శ్రీలక్ష్మినర్సింహ స్వామిని దర్శించుకునేందుకు ఇబ్బందులు పడాల్సివచ్చింది. ఆటో లు కాని, వారు వెంట తెచ్చుకున్న వాహనాలు కాని వేము లవాడకు చేరుకున్న అనంతరం తిరిగి బయటకు వెళ్లేం దుకు పోలీసు అధికారులు అడ్డుకోగా, వారు ఎటువైపు వెళ్లాలో తెలియక తికమకపడ్డారు. అయితే మినీబస్సు లను కేటాయించినప్పటికి అవికేవలం వేములవాడ ప్రధాన బస్‌స్టేషన్ వరకే నడుపగా, అక్కడి నుండి ఆటోలు కాని, వేరే ఇతర వాహనాలు కాని లేవు. అయితే ఆర్టీసి బస్సులు కరీంనగర్ వైపు వెళుతున్నప్పటికి అవి నాంపల్లికి వెళుతాయో లేదో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నామని పలువురు భక్తులు తెలిపారు. దీనితో నాంపల్లి గుట్టపై వచ్చే ఆదాయం కొద్ది పాటి తగ్గుముఖం పట్టింది.
రాజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు
మహాశివరాత్రి సందర్భంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వార లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఈటెల రాజేందర్, టిటిడి తరపున దేవస్థానం జెఇఓ శ్రీనివాస రావులు పట్టువస్త్రాలను సమరించారు. గురువారం రాత్రి వారు వేము వాడకు చేరుకోగా, శుక్రవారం వేకువజా మున వారు భాజాభంత్రీల మధ్య, ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పట్టువస్త్రాలను ఆలయంలోకి తీసుకువచ్చి, శ్రీస్వామివారికి సమర్పించారు. ఈ సంద ర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించా రు. అనంతరం ఆలయ అర్చకులు వారికి శ్రీస్వామివారి ఆశీర్వచనాలు ఇవ్వగా, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్‌తో పాటు ఆలయ ఇఓ దూస రాజేశ్వర్‌లు వారిని ఘనంగా సత్కరించి, శ్రీస్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. వీరి వెంట ఎంపి వినోద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమా, ఎమ్మెల్యేలు కమలాకర్, రసమయి బాలకిషన్, ఎస్పీ విశ్వజిత్ కంపాటి, డిఆర్‌ఓ శ్యాంప్రసాద్‌లాల్‌లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు ఎర్రం మేహష్, గొస్కుల రవి, ప్రతాప రామకృష్ణలు పాల్గొన్నారు.
మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు విచ్చే సిన భక్తులను ఆహ్లాదపరిచేందుకు రాష్ట్ర భాష సాంస్కృ తిక, దేవాదాయ శాఖల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. గురు వారం రాత్రి 7 గంటలకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరుణాకర్‌రెడ్డి ఈ కార్యక్రమాలను జ్యోతిప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కె.చం ద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ప్రాముఖ్య తను గుర్తించి, ఆ ఆలయాల అభివృద్ధికోసం కృషి చేస్తు న్నారని అన్నారు. రానున్న మరో 2 సంవత్సరాల్లో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంతోపాటు వేములవాడ పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులను కేటాయించనున్నారని, వీటిని ఆలయ అధికారులు, జిల్లా అధికారులు సక్రమంగా వినియోగమయ్యేట్లు చూడాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడుతూ వేములవాడ ఆలయ, పట్టణ అభివృద్ధికి సిఎం కెసిఆర్ రూ.400కోట్లను మం జూరు చేయడం హర్షించదగిందని, ఈ నిధులతో దాదాపు ఇప్పటికే సంగం వరకు పనులను ప్రారంభించామని, మరి కొన్ని పనులు మిగిలిపోయాయని వాటిని కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయం అభి వృద్ధితో రాజన్నసిరిసిల్ల జిల్లాలోని శైవ, నేతన్నల అభి వృద్ధికి గట్టిపునాదులు పడ్డాయన్నారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, సాం స్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa