ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ నిర్మాత కొడుకు.. అలా చేసి బుక్కయ్యాడా?

Telangana Telugu |  IANS  | Published : Sat, Feb 25, 2017, 01:05 PM

నిర్మాత పరుచూరి ప్రసాద్ కుమారుడిగా పరుచూరి కిరీటి.. టాలీవుడ్ కి సుపరిచితమే. టైటిల్ కార్డ్స్ పరంగా సింహ.. నా ఇష్టం.. షాడో చిత్రాలకు కిరీటి నిర్మాత కూడా. ఇప్పుడీ కుర్ర ప్రొడ్యూసర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.గత 3 రోజులుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 44.. 45.. 46లలో రాష్ డ్రైవింగ్ చేస్తున్నందుకు గాను కిరీటిపై కేసు బుక్ చేశారు పోలీసులు. పెట్రోలింగ్ సిబ్బంది నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ కేసు నమోదు అయినట్లు చెబుతున్నారు. అయితే.. అసలు కథ వేరే ఉందని టాక్. ఈ మూడు రోజులుగా.. ఓ బడా అధికారి కూతురు వెనక పడుతున్నాడట కిరీటి. ఇదే విషయాన్ని సూటిగానే ప్రశ్నించారట కూడా. అయితే.. అసలు ఆ విషయమే తనకు తెలీదని చెప్పాడట ఈ కుర్రాడు.పోకోమాన్ గేమ్ లో భాగంగా.. ఆ రోడ్లపై సంచరించానని చెప్పాడట కిరీటి. కానీ ఆ పిల్ల మాత్రం కిరీటి విషయంలో తండ్రికి ఫిర్యాదు చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పుకుంటున్నారు సినీ జనాలు. అయితే కుర్రాడు ఇరుక్కున్న సిట్యుయేషన్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa