లాస్ఏంజిల్స్: బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ లాస్ ఏంజిల్స్‌లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. తన 36వ పుట్టినరోజు నాడు ఒక ఎకరా విస్తీర్ణంలో ఉన్న ఈ కళ్లు చెదిరే ఇంద్రభవనానికి యజమానురాలైంది. హాలీవుడ్ స్టార్స్ ఉండే లాస్ ఏంజిల్స్‌లోని షెర్మాన్ ఓక్స్ ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమె షేర్ చేసింది. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఇంటి ముందు ఓ వినాయకున్ని కూడా ప్రతిష్టించడం విశేషం.ఐదు బెడ్రూమ్లు, ఓ స్విమ్మింగ్ పూల్, హోమ్ థియేటర్, ఔట్‌డోర్ డైనింగ్ ఏరియా, పెద్ద గార్డెన్ ఈ ఇంద్రభవనంలో ఉన్నాయి. చాలా కాలంగా తాను, సన్నీ ఈ ఇంటిని కొనాలని అనుకున్నట్లు ఆమె భర్త డేనియల్ వెబర్ చెప్పాడు. ఇంటీరియర్ కోసం ఇటలీ, రోమ్, స్పెయిన్లలో షాపింగ్ చేసినట్లు అతను తెలిపాడు.