ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊరంతా పండుగలా రాష్ర్ట అవతరణ దినోత్సవ వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2017, 01:51 AM

సూర్యాపేటప్రతినిధి, మేజర్‌న్యూస్‌: జూన్‌ 2న జరుగు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అన్ని గ్రామాలు, పట్టణప్రాంతాలు ఉత్సవంగా జరుపాలని రాష్ట్ర భాషాసాంసృ్కతిక, పర్యాటక, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌ సూచించారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ సలహదారు డా, కె. వి. రమణాచారి, రాష్ర్ట పర్యాటక, సాంసృ్కతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేవం, డైరెక్టర్‌ మామిడి హరికృష్ణలతో కలసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెస్సులో మంత్రి చందూలాల్‌ మట్లాడుతూ అవతరణ ఉత్సవాల సందర్బంగా అమరవీరులకు నివాళులర్చిపంచాలని తె లిపారు. వృద్ద ఆశ్రమాలు, ఆసుపత్రులలో పండ్లు, స్వీట్లు పంపిణి చేఏయాలని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రముఖలకు జిల్లా స్థాయి అవార్డులు ఇచేందుకు ఎంపిక చేయాలని సూచించారు. గతంలో 25మందికి జిల్లా స్థాయి అవార్డులు ఇచ్చినప్పటికి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో పరిధి త గ్గినందున, అవార్డుల ప్రమాణాన్ని పెంచేందుకు 10 అవార్డులకే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రతి అవార్డుకు ఇచ్చే నగదు పురస్కరాన్ని రూ. 51,116/-లను యధాత ధాంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిరేధశించినట్లు తెలిపారు. అవార్డలకు రూ. 5,11, 160/- లు ఇవ్వాలని, మిగిలిన డబ్బుతో ఏర్పాట్లను, కళాబృందాల ప్రదర్శనలు, సాంసృ్కతిక కార్యక్రమాలకు వినియో గించుకోవాలని సూచించారు. రాష్ర్ట ప్రభుత్వ సలహదారు కె.వి. రమణాచారి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల స్థూపాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసు కోవల్సిన బాద్యత మనందరిపై వున్నదని పేర్కోన్నారు.  రాష్ర్ట సాంసృ్కతిక, పర్యా టక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ 2018 జనవరిలో పతంగుల పండుగ నిర్వహించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. దసరా నుండి ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించేం దుకు ముందస్తుగా కార్యచరణ రూపొందుంచుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ కె. సురేంద్రమోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనం గా జరుపేందుకు అన్ని స్థాయిలో యంత్రాంగాన్ని సిద్దం చేసినట్లు తెలిపారు. వేడుకలలో భాగంగా అమ్మబడి, ఒంటరి మహిళలు, ఇతర సంక్షేమ పధకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉండ్రగొండ ఫోర్టునందు పతంగుల పండుగ జరిపేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈవీడియోకాన్పరెన్సులో డిఆర్‌వో పి. యాదిరెడ్డి, డిఆర్‌డివో కిరణ్‌కుమార్‌, సమాచారశాఖ ఏడి యాసా వెంకటేశ్వర్లు, డిఇఐఇ సారయ్య, డిఇవో వెంకటనర్సమ్మ, ఆర్‌డివో యస్‌. మోహన్‌రావు, డిపివో రామోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com