ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 01:52 AM
 

మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడు తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని కడియం శ్రీహరి అన్నారు. అభివృద్దిలో వర్దన్నపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా నిలవాలన్నారు. నగర శివార్లలోని ఓ ఫంక్షన్‌ హల్‌లో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఇక్కడ తాను ఎంపిగా పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీ వచ్చిందని గుర్తు చేశారు. అదే ప్రేమతో వర్దన్నపేటకు అధికంగా నిధులు కెటాయిస్తునానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు.  ఓరుగల్లు నగరాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని  కడియం శ్రీహరి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ప్రధాన మంత్రి నరేంద్రమోఢీల సహకారంతో ఓరుగల్లు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్‌ను స్మార్ట్‌ నగరంగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఙతలు తెలిపారు. కేంద్రం నుండి విడుదలయ్యే నిధులతో సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో వరంగల్‌ను అభివృద్ది చేస్తామన్నారు. ఇప్పటికే సిఎం వరంగల్‌ను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తీర్చిదిద్దు తున్నారని కొనియాడారు. ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాల యం, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, సైనిక్‌ స్కూల్‌, హెల్త్‌ యూనివర్శిటి వంటి  విద్యాలయాలు కూడ వరంగల్‌కు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కెజి టు పిజి ఉచిత విద్య, ఆసరా వంటి పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతు న్నాయన్నారు. కాకతీయులు నిర్మించిన కట్టడాలు ఓరుగల్లుకు వన్నె తెస్తున్నాయని హృదయ్‌ పథకం కింద వీటి అభివృద్దికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. పర్యాటక రంగంలో వరంగల్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కడియం శ్రీహరి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, ఇండ్ల నాగేశ్వరరావు, రాజు నాయక్‌, మార్నేని రవీందర్‌రావు, పాలకుర్తి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.