గోదాములకు నాబార్డు నిధులు

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 03:05 AM
 

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : దీంతో మిగిలిన నిధులతో పాటు మరికొన్ని నిధులు ఇవ్వా ల్సిందిగా నాబార్డును మార్కెటింగ్‌ శాఖ కోరినట్లు తెలిపారు. శుక్రవారం మార్కెటింగ్‌ శాఖపై మంత్రి హరీశ్‌రావు అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఒక లక్షా 22వేల 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో అదనంగా 34 గోడౌన్లను నిర్మించేందు కు నాబార్డు రూ.73.50కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 300 గోడౌన్ల నిర్మాణం పూరె్తైనట్లు తెలిపారు. మరో 21 గోడౌన్లు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధి కారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 11 కోల్డ్‌ స్టోరేజిల నిర్మాణ పనుల పురుగతిని హరీశ్‌రావు సమీక్షించారు. దేవరకొండలోని దొండకాయల మార్కెట్‌, పటాన్‌చెరులో ఉల్లిగడ్డ మార్కెట్‌ ఇతర పండ్ల మార్కెల్లు 3 నెలల్లో అందుబాటులోకి తీసుకరావాలని మంత్రి ఆదేశించారు. గడ్డి అన్నారం మార్కెట్‌ కోహెడకు తరలింపుపై సమీక్షించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌ను రఘునాథపాలెంకు తరలించే ప్రయత్నాలను మంత్రి సమీక్షించారు. కాగా.. జిల్లాల వారీగా నిర్మల్‌లో 2గోడౌన్లు, సిరిసిల్లాలో 1, కామారెడ్డిలో 4 భద్రాద్రి కొత్తగూడెంలో 2, జగిత్యాలలో 2, కరీంనగర్‌లో 2, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2, ఖమ్మంలో 1, నల్లగొండలో 2, సూర్యాపేటలో 6, శంషాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 6, నిజామాబాద్‌ జిల్లాలో 2 గోడౌన్లను అదనంగా నిర్మించాలని మార్కెటింగ్‌ శాఖ సంకల్పించినట్లు తెలిపారు. టెండర్లలో పారదర్శకత వల్ల రూ.150కోట్లు మిగిలినట్లు మంత్రి తెలిపారు. అందులో రూ.75కోట్లతో వే బ్రిడ్జిలు, కాంపౌండ్‌ గోడల నిర్మాణం, కార్యాలయ భవనాలు, విద్యుత్‌ వసతి కల్పించినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. మిగిలిన రూ.75కోట్ల నిధులతో అదనంగా 34 గోదాములు నిర్మించుటకు నాబార్డ్‌ను మార్కెటింగ్‌ శాఖ కోరగా, అనుమతి లభించింది. ఈ సమీక్షా సమావేశంలో మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, పద్మ, నాగేశ్వర రెడ్డి, లక్ష్మణుడు, రవికుమార్‌, శ్రీనివాస్‌, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.