అతిత్వరలో కేబినెట్‌ విస్తరణ?!

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 03:07 AM
 

ఐదుగురికి ఉద్వాసన?


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ప్రస్తుత మంత్రివర్గంలో నల్గురు, ఐదుగురు మంత్రులుకు ఉద్వాసన తప్పకపోవ చ్చుననే వాదనలు పార్టీవర్గాల్లో  వినిపి స్తున్నాయి. మంత్రివర్గం నుంచి తప్పిం చిన వారికి పార్టీ కీలకబాధ్యలను అప్ప గించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వయోభారం కారణంగా మంత్రివర్గంలో నుంచి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి, గిరి జన, పర్యాటక శాఖ మంత్రి చందు లాల్‌ను తప్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రి పద్మారావును, జోగు రామ న్నను తప్పించవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మంత్రివ ర్గంలో మహిళలకు స్థానం కల్పించక పోవడం వల్ల  విమర్శలను  ఎదుర్కొం టున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఈ సారి విస్తరణ అంటూ చేపడితే   ఖచ్చితంగా మహిళలకు ఛాన్స్‌ కల్పించే అవకాశాలున్నట్లు  పార్టీవర్గాలు తెలిపాయి. చందులాల్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే,  అదే సామాజిక వర్గానికి చెందిన కోవాలక్ష్మి స్థానం కల్పించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జోగురామన్నను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో కొండా సురేఖకు అవకాశం కల్పించవచ్చునని పార్టీ వర్గాలు తెలిపాయి. కొండా సురేఖకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా అటు చేనేత, ఇటు మున్నురుకాపు సామాజికవర్గాన్ని సంతృప్తిసర్చవచ్చునన్న యోచనలో కేసీఆర్‌ ఉన్నారంటున్నారు. మంత్రి పద్మారావును తప్పిస్తే ఆయన స్థానంలో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, లేనిపక్షంలో ఉద్యోగసంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్‌లలో ఒకరికి  మంత్రివర్గంలో  ముఖ్యమంత్రి అవకాశాన్ని  కల్పించే ఛాన్స్‌ ఉందని అంటున్నారు.  2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకురాగల సత్తా కలవారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని, అదేసమయంలో జిల్లాల్లో గట్టిపట్టున్న వార్నే మంత్రులుగా కొనసాగించాలని కేసీఆర్‌ భావిస్తున్నారంటున్నారు. కొంతమంది మంత్రులు ఎంత చెప్పిన తమ పనితీరు మార్చుకోవడం లేదన్న అసంతృప్తితో  కేసీఆర్‌ రగిలిపోతున్నారంటున్నారు. దాంతో పనితీరు మెరుగుపర్చుకొని మంత్రులను తప్పించి, వారికి పార్టీ బాధ్యతలను అప్పగించడం ద్వారా, కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వెసులుబాటు లభిస్తుందన్న భావనలో కేసీఆర్‌ ఉన్నారంటున్నారు. మంత్రిరవ్గ విస్తరణకు తొలుత పెద్దగా సుముఖత వ్యక్తం చేయని కేసీఆర్‌, తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టడమే బెటరన్న నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.