ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీఎస్టీ నుంచి విద్య, వైద్య రంగాలకు పన్ను మినహాయింపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 20, 2017, 03:10 AM

పన్ను లేని వస్తువులు: తాజా మాంసం, తాజా చికెన్‌, గుడ్లు, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, పిండ్లు, ఉప్పు, బ్రెడ్‌, బిందీ, సిందూర్‌, స్టాంపు, జ్యుడి షియల్‌ పేపర్స్‌, ప్రచురించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు.


5 శాతం పన్నుపరిధిలోకి: ఫిష్‌ పిల్లెట్‌, క్రీమ్‌, స్కిమ్డ్‌ మిల్క్‌ ఫౌడర్‌, బ్రాండెడ్‌ పన్నీర్‌, నిల్వ ఉంచిన కూరగాయలు, కాఫీ, టీ, స్పైసీస్‌, పిజ్జా బ్రెడ్‌, రస్క్‌, సగ్గుబియ్యం, కిరోసిన్‌, కోల్‌, మెడిసిన్స్‌, స్టెంట్‌, లైఫ్‌ బోట్స్‌


12 శాతం శ్లాబ్‌ లోకి: నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్‌, సాసేజ్‌, పండ్ల రసాలు, భుటియా, నామ్కిన్‌(చిప్స్‌ లాంటివి), ఆయు ర్వేదిక్‌ మెడిసిన్లు, టూత్‌ ఫౌడర్‌, అగర్‌ బత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గొడుగు, కుట్టు మిషన్లు, సెల్‌ ఫోన్లు.


18 శాతం పరిధిలోకి: ఈ పన్ను పరిధిలోకే చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. షుగర్‌, పాస్తా, కార్న్‌ ఫ్లేక్స్‌, రొట్టెలు, కేకులు, జామ్స్‌, సాసులు, సూప్స్‌, ఐస్‌ క్రీమ్‌, ఇన్‌ స్టాంట్‌ ఫుడ్‌ మిక్సెస్‌, మినరల్‌ వాటర్‌, టిష్యూలు, ఎన్విలాప్స్‌, టాంపోన్స్‌, నోట్‌ బుక్స్‌, స్టీల్‌ ప్రొడక్ట్స, ప్రింటెడ్‌ సర్క్యూట్స్‌, కెమెరా, స్పీకర్స్‌, మానిటర్స్‌.


28 శాతం పన్ను పరిధిలోకి: చూయింగ్‌ గమ్‌, మొలాసిస్‌, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్‌, పాన్‌ మసాలా, పేయింట్‌, ఫర్‌ ప్యూమ్‌, షేవింగ్‌ క్రీమ్స్‌, హెయిర్‌ షాంపు, డై, సన్‌ స్క్రీన్‌, వాల్‌ పేపర్‌, పింగాణి పాత్రలు, వాటర్‌ హీటర్‌, డిష్‌ వాషర్‌, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్‌ మిషన్‌, ఏటీఎంలు, వెండింగ్‌ మిషన్లు, వాక్యుమ్‌ క్లీనర్స్‌, షేవర్స్‌, హెయిర్‌ క్లిప్పర్స్‌, ఆటోమొబైల్స్‌, మోటార్‌ సైకిల్స్‌, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్‌ క్రాఫ్ట్‌. 


 


న్యూఢిల్లీ: దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలుచేయాలనే సంకల్పంతో కేంద్రం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జులై 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న వేళ జీఎస్టీ కౌన్సిల్‌ శ్రీనగర్‌లో రెండో రోజు సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కీలక రంగాలైన విద్య, ఆరోగ్య సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వగా, టెలికమ్యూనికేషన్‌, ఆర్థిక సేవలపై 18% పన్ను విధించింది. జూన్‌ 3న మరోసారి జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో బంగారం ధరపై పన్ను శాతాన్ని నిర్ణయించనున్నారు. దాదాపు ఆరు మినహా 1211 వస్తువులపై జీఎస్టీ పన్ను విధానాలను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశమంతా ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ రేట్లను ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. దాదాపు 90 శాతం వస్తువులు అంటే 1205 వస్తువులను వివిధ రకాల పన్ను శ్లాబ్స్‌ లోకి తీసుకొచ్చేసింది. ఈ నేపథ్యంలో ఏయే వస్తువులు ఏయే రేట్ల పరిధిలోకి వస్తాయో ఓ సారి పరిశీలిస్తే,


పన్ను లేని వస్తువులు: తాజా మాంసం, తాజా చికెన్‌, గుడ్లు, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, పిండ్లు, ఉప్పు, బ్రెడ్‌, బిందీ, సిందూర్‌, స్టాంపు, జ్యుడిషియల్‌ పేపర్స్‌, ప్రచురించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు.


5 శాతం పన్నుపరిధిలోకి: ఫిష్‌ పిల్లెట్‌, క్రీమ్‌, స్కిమ్డ్‌ మిల్క్‌ ఫౌడర్‌, బ్రాండెడ్‌ పన్నీర్‌, నిల్వ ఉంచిన కూరగాయలు, కాఫీ, టీ, స్పైసీస్‌, పిజ్జా బ్రెడ్‌, రస్క్‌, సగ్గుబియ్యం, కిరోసిన్‌, కోల్‌, మెడిసిన్స్‌, స్టెంట్‌, లైఫ్‌ బోట్స్‌


12 శాతం శ్లాబ్‌ లోకి: నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, నెయ్యి, ప్యాకేజీగా వచ్చే డ్రై ఫ్రూట్స్‌, సాసేజ్‌, పండ్ల రసాలు, భుటియా, నామ్కిన్‌(చిప్స్‌ లాంటివి), ఆయుర్వేదిక్‌ మెడిసిన్లు, టూత్‌ ఫౌడర్‌, అగర్‌ బత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, గొడుగు, కుట్టు మిషన్లు, సెల్‌ ఫోన్లు.


18 శాతం పరిధిలోకి: ఈ పన్ను పరిధిలోకే చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. షుగర్‌, పాస్తా, కార్న్‌ ఫ్లేక్స్‌, రొట్టెలు, కేకులు, జామ్స్‌, సాసులు, సూప్స్‌, ఐస్‌ క్రీమ్‌, ఇన్‌ స్టాంట్‌ ఫుడ్‌ మిక్సెస్‌, మినరల్‌ వాటర్‌, టిష్యూలు, ఎన్విలాప్స్‌, టాంపోన్స్‌, నోట్‌ బుక్స్‌, స్టీల్‌ ప్రొడక్ట్స, ప్రింటెడ్‌ సర్క్యూట్స్‌, కెమెరా, స్పీకర్స్‌, మానిటర్స్‌. 


28 శాతం పన్ను పరిధిలోకి: చూయింగ్‌ గమ్‌, మొలాసిస్‌, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్‌, పాన్‌ మసాలా, పేయింట్‌, ఫర్‌ ప్యూమ్‌, షేవింగ్‌ క్రీమ్స్‌, హెయిర్‌ షాంపు, డై, సన్‌ స్క్రీన్‌, వాల్‌ పేపర్‌, పింగాణి పాత్రలు, వాటర్‌ హీటర్‌, డిష్‌ వాషర్‌, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్‌ మిషన్‌, ఏటీఎంలు, వెండింగ్‌ మిషన్లు, వాక్యుమ్‌ క్లీనర్స్‌, షేవర్స్‌, హెయిర్‌ క్లిప్పర్స్‌, ఆటోమొబైల్స్‌, మోటార్‌ సైకిల్స్‌, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్‌ క్రాఫ్ట్‌. 


టెలికాంకు షాకిచ్చిన జీఎస్‌టీ: టెలికాం సేవలపై 18శాతం పన్ను రేటు నిర్ణయించడంపై అపుడే దుమారం మొదలైంది. దీనిపై టెలికం పరిశ్రమ పెద్దలు నిరాశ వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ఇటు పరిశ్రమపైనా. అటు వినియోగదా రులపైనా భారాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. దీంతో దేశీయంగా టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయనే ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు పన్నుల రేట్లను ఖరారు చేస్తూ జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. పన్ను విధానంపై ఈ నెల 18, 19 తేదీల్లో జమ్మూకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్సమావేశంలో సర్వీసెస్‌ పన్నుల శ్లాబ్‌లను ఖరారు చేసింది. ముఖ్యంగా టెలికాం, బీమా, హోటళ్ళు, రెస్టారెంట్లుపై పన్ను రేట్లను ఫైనల్‌ చేసింది. జులె 1 నుంచి జీఎస్‌టీ ను అమలు చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్‌ జెట్లీ శుక్రవారం చెప్పారు. అయితే టెలికాం సేవలపై 18శాతం పన్ను నిర్ణయించడంపై మార్కెట్లో చర్చకు దారి తీసింది.


ముఖ్యంగా టెలికాం పరిశ్రమం 18 శాతం పన్నురేటుపై నిరాశ వ్యక్తం చేసింది. జీఎస్‌టీ స్వాగతించినప్పటికీ,తమకు 18శాతం ప్రకటించిన రేటుతో తాము నిరాశకు గురయ్యామని తెలిపింది. ఇది ఇప్పటికే నష్టాల్లో టెలికాం పరిశ్రమపై మరింత భారాన్ని పెంచుతుందని సెల్యూలర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డెరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 15 శాతం కాకుండా 18శాతంగా నిర్ణయించడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందన్నారు. అలాగే దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన మందగించటం, డిజిటల్‌ ఇండియా, క్యాష్‌లెస్‌ ఇండియాలాంటి ఇతర ప్రధాన కార్యక్రమాలపె ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అత్యవసర సేవలుగా ఉన్న టెలికాం రంగానికి మరిన్ని పన్ను మినహాయింపులు, ప్రయోజాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.చివరి మెలువరకు ప్రతిఒక్కరికీ కనెక్టివిటీ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పరిశ్రమ నిర్వరామంగా కౄఎషి చేసిందని మాథ్యూస్‌ పేర్కొన్నారు కాగా శ్రీనగర్‌లో నిర్వహించిన తాజా జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశాల్లో నాలుగు అంచెల పన్నుల రేట్లను ఖరారు చేశారు. ముఖ్యంగా విద్య, వైద్య సేవలకు జీఎస్‌టీ నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే.


జీఎస్‌టీతో ఎఫ్‌ఎంసిజిల షేర్లు లాభాల్లోకి 


ముంబై: స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ సంస్థల షేర్ల ధరలు శుక్రవారం దూసుకుపోయాయి. జులై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వల్ల కొబ్బరి నూనె, సబ్బులు, టూత్‌ పేస్టుల వంటి సాధారణ వినియోగ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దీంతో మార్కెట్లో మదుపర్ల సెంటిమెంట్‌ బలంగా ఉండటంతో ఆయా సంస్థల షేర్లు 7 శాతం పెరిగాయి.


బాంబే స్టాక్‌ ఎక్సే్ఛంజీలో టాటా కాఫీ షేర్లు 6.84, కాల్గెట్‌ ఫామోలివ్‌ 6.53, ఐటీసీ 6.27 శాతం పెరిగాయి. మారికో 4.84, కేఆర్‌బీఎల్‌ 4.59, ఇమామీ 3.36, హెచ్‌యూఎల్‌ 3.5, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ 3.36 శాతం చొప్పున షేర్లు లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ సూచీ 2.29 శాతం లాభంతో 9,668.20 స్థాయికి చేరుకొంది. సాధారణ వినియోగ వస్తువులు జీఎస్టీలో 18 శాతం పన్ను పరిధిలోకి రానున్న సంగతి తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com