పోలీసులకు వరాలు

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 03:15 AM
 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా నక్సల్స్‌ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. అలాంటి ఆరోపణలను పటాపంచలు చేసిన ఘనత రాష్ట్ర  పోలీసులకే దక్కుతుందన్నారు. రాష్ట్ర పోలీసులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ నిధులతో ఆధునిక వాహనాలు కొనుగోలు చేయాలని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని సూచించారు.


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : హైదరాబాద్‌ పోలీసులు అద్బుతంగా పని చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి  కితా బునిచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణలో  చక్కటి ఫలి తాలు సాధించారని ప్రశంసించారు. శుక్రవారం హెచ్‌ ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ నుంచి మొద లుకుని ఎసై్స వరకు పోలీసుశాఖలోని వివిధస్థాయిల అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈకార్యక్రమానికి హోమంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ తదిత రులు హాజరయ్యారు. ఈసందర్భంగా కేసీఆర్‌ మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర సాదన డిమాండ్‌ న్యాయమైన డిమాండన్న కేసీఆర్‌దానికి పోలీసుల సహకారం కూడా లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమ యంలో తాను చేసిన ఉపన్యాసాలను పోలీసులు విన్నా రని, ఎవరూ ఊహించని రాష్ట్రాన్ని కష్టపడి సాధించామ న్నారు. రాష్ట్ర సాధన లక్ష్యాన్ని నేరవెర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధాని, హోంమంత్రులు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశసించారని కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ పోలీసులు గొప్పని, యంగెస్ట్‌ గ్రేటెస్ట్‌ పోలీస్‌ ఆఫ్‌ ఇండియా అంటూ దేశవ్యాప్తంగా కీర్తిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు సాధించినఘనత పట్ల గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ పోలీసులు పనితీరు గొప్పగా ఉందన్న ఆయన, ఈపనితీరు మరింత మెరుగు కావాలని సూచించారు. ఎప్పుడూ రిలాక్స్‌ కావద్దని పోలీసులకు సూచించారు. బెస్ట్‌ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ చాల ముఖ్యమైందన్నారు. ఓ దశ తర్వాత మరో దశ లక్ష్యంతో పని చేయాలన్నారు. డిజీపీ, హోమంత్రి కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేసీఆర్‌ సూచించారు. జోన్ల సమస్యలను స్ట్రీమ్‌లైన్‌ చేయాలని, డిపార్ట్‌మెంట్‌ హెడ్స్‌కు ప్రమోషన్లు కల్పించాలన్నారు. ప్రమోషన్‌ తగిన సమయానికిస్తే అదే బెస్ట్‌ రిఫార్మ్‌ అవుతుందన్నారు. అలా చేస్తే డ్యూటీ గురించి ఆలోచించాల్సిన ఇబ్బంది ఉండదన్నారు. ప్రమోషన్ల అంశంలో పోలీసుశాఖకు ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రిటైర్‌ అయ్యే పోలీసులకు అన్ని సౌకర్యాలు కల్పించి, వారి అవసరాలు తీర్చాలన్నారు. పెన్షన్‌ అర్హత ఉన్నవారు, పైరవీల జోలికి వెళ్లకుండా చూసుకోవాలన్నారు. రిటైర్‌ అయ్యే పోలీసులకు పెన్షన్‌ ప్యాక్‌ ఎప్పటికప్పుడు రెడీ ఉండాలన్నారు. పదవి విరమణ చేసిన పోలీసులను సకల మర్యాదలతో సాగనంపాలన్న ఆయన, మహిళాపోలీసులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. పోలీసు కమిషరేట్‌ ఎలా  ఉండాలన్న అంశంపై శిక్షణ తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు.