ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర తెలంగాణపై అమిత్‌షా దృష్టి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:39 AM

కరీంనగర్‌ -సూర ్యప్రత్యేకప్రతినిధి:ఉత్తర తెలంగాణపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గెలిచి పట్టు సాధించేందుకు అమిత్‌షా మాస్టర్‌ ప్లాన్‌ను సిద్దం చేసినట్లు సమాచారం. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన ఉప ఎన్నికల్లను పలు రాష్ట్రా సాధారణ ఎన్నికల్లో అసాధరణ విజయాలు సాధిస్తు అప్రతిహతంగా ముందుకు వెళుతోంది. దినంతటికి మోదీ,అమిత్‌షాలు అరెస్సెస్‌మార్గ దర్శకత్వంలో రూపొందించిన మాస్టర్‌ ప్లానే కారణమని తెలుస్తొంది. ఇదే ప్లాన్‌ను దక్షిణ భారతదేశంలో కీలకమైన తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగించి అధికారం కైవసం చేసుకునేందుకు మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. మావోయిస్టు కేంద్రకమిటిలో, వివిధ రాష్ట్రాల్లో కీలక పాత్రపోషిస్తున్న మావోయిస్టులు అందరు ఈ ప్రాంతానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు దేశంలో ప్రభుత్వంతో గిరిజినుల పక్షాన యుద్దంచేస్తున్న కీలక నేతలది ఈ ప్రాంతమే. అందుకే మావోస్టుల పురిటి గడ్డ అయిన ఉత్తర తెలంగాణాలో 2019 ఎన్నికల్లో జెండా ఎగురవేసేందుకు దీటైనా అభ్యర్థులను నిలిపేందుకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నెల 22న తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వస్తున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 35 మంది అభ్యర్థులను పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించనున్నట్లు సమాచారం. వీరిలో పెద్దపల్లి నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా సీనియర్‌ కార్యకర్త, అరెస్సెస్‌ ఆశిస్సులు మెండుగా  ఉన్న దుగ్యాల ప్రదీప్‌రావు పేరు పెద్దపల్లికి, కరీంనగర్‌కు బండి సంజయ్‌లతో పాటు మిగతా 33మంది శాసన సభ అభ్యర్థిత్వపు కార్యాచరణను బిజెపి లెజెండ్‌, పార్టీ దిశానిర్దేశకుడు అమిత్‌ షా ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వీరి ఎంపికలో గుజ్జుల రామక్రిష్ణారెడ్డికి గాడ్‌ఫాదర్‌గా వ్యవహరించిన వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ సాగర్‌జీ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణకు గుండె కాయలాంటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒకప్పుడు ప్రభుత్వానికి, బిజెపికి వ్యతిరేకండా మావోయిస్టు కార్యకలపాలతో అట్టుడుకేది. ఇప్పుడు ఎంఐఎం ఈ ప్రాంతంలో శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో పాటు చత్తస్‌ఘడ్‌, జార్ఖండ్‌ వంటి ఉత్తర భారతదేశంలో అల్లకల్లోలం సృష్టిస్తు ప్రభుత్వానికి సవాల్‌గా మారిన మావోయిస్టు నేతలు ఈ ప్రాంతానికి చెందిన వారవడంతో ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ధీటైన అభ్యర్థులకు అవకాశం ఇచ్చి అధికారంలోకి రావాలని అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


వెంకయ్య నాయుడు మద్దతుతో గుజ్జుల రామకృష్ణారెడ్డి, అద్వాణి మద్దతుతో విద్యాసాగర్‌రావులకు రెండు గ్రూపులుగా పని చేసే వారు. ప్రధాని మోది పార్టీ  జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు అధికారమే పరమాదిగా పార్టీలో యువకులకు పెద్దపీట వేస్తుండడంతో పరిస్థితి మారిపోయింది. దీంతో మారినప్రస్తుత పరిస్థితులలో వెంకయ్యనాయుడు, గవర్నర్‌ సాగర్‌జీలు తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే జూలపల్లి మండలానికి చెందిన దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ను పెద్దపల్లికి, బండి సంజయ్‌ను కరీంనగర్‌కు ఖరారు చేసి అమిత్‌షా ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తున్నట్టు సామాచారం. కాగా 1998లో టిడిపి, బిజెపిల పొత్తులోభాగంగా పెద్దపల్లిని బిజెపి కేటాయించి మిత్రపక్షం అభ్యర్థి గుజ్జుల గెలుపునకు పని చేయాలని చెప్పిన చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి పార్టీశ్రేణులు పని చేసి గెలిపించారు. కానీ... 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా పెద్దపల్లిని టిడిపి కేటాయిస్తే గుజ్జుల టిడిపి గెలుపుకోసం కాకుండా టిఆర్‌ఎస్‌ సహకరించినట్లు బెజిపి అధిష్టానానికి గుజ్జులపై ఫిర్యాదులందినట్టు సమాచారం. గుజ్జులపై చేసిన ఫిర్యాదులో చంద్రబాబు కీలకపాత్ర పోషించినట్లు అప్పట్లో ప్రచారం జరుగుతుంది. టిడిపి అభ్యర్థికి బదులు టిఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపునకు పనిచేసాడని ఏపి సిం చంద్రబాబు , వెంకయ్యనాయుడు ద్వారా అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం అవుతుంది. అంతే కాకుండా ఆంధ్ర, తెలంగాణాల్లో పార్టీ అభ్యర్థుల ఓటములపై ఇంటెలిజెన్స్‌ వర్గాలతో పాటు ఇతర ఏజెన్సిలతో ఆరా తీసిన్పుడు పెద్దపల్లిలో పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా బిజెపి రాష్ట్ర ఉపాద్యాక్షుడైన గుజ్జుల టిఆర్‌ఎస్‌ అనుకూలంగా పని చేసినట్లు అమిత్‌షా దృష్టికి వెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీలో నాయకత్వం ఎదగకుండా అణగదొక్కుతాడని ప్రచారంలో ఉంది. దీంతో పాటు ఎన్నికల ఖర్చు కోసం పార్టీ ఇచ్చిన ఫండ్‌ ఖర్చు చేయడంలో తన సామాజిక వర్గానికి చెందిన వారికే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై షాకు ఫిర్యాదులందినట్టు సామాచారం. జిల్లా అధ్యక్ష ఎన్నికల సందర్బంగా స్థానికనాయకులను కాదని, కాశిపేట లింగయ్యకు కట్టబెట్టారని కార్యకర్తలు అసహానం వ్యక్తం చేస్తున్నారు. బీసి, ఎస్సి కార్యకర్తలు చనిపోతే కనీసం పరామర్శించడనే పేరుంది. తనకు రాజకీయంగా పోటి పడతారనే కారణంతో ఎంపిపిలుగా, జడ్పిటిసిలుగా గెలుపొందే స్థానాల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు సహకరిస్తారని అమిత్‌షాకు చేసిన ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. అరెస్సెస్‌ ఆధ్వర్యంలో మేథోమథన బృందం ధేశం కోసం, పార్టీ కోసం నిస్వార్థంగా సేవచేసే తరుపు ముక్కలను పార్టీకి అందిస్తున్నది. అందుకోసం పార్టీ అభ్యర్థుల ఎంపికకు ప్రధాని నరేంద్ర మోది పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాలు అరెస్సెస్‌ ఆలోచనల మేరకు నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఉత్తర ప్రదేష్‌ సిఎంగా ఆదిత్యనాథ్‌ యోగిని, దీల్లి మున్సిపాలిటి ఎన్నికల్లో 100మంది కొత్తవారిని, యువకులను ని బెట్టి విజయం సాధించారు. అందుకే మోధి, షాల ఆధ్వర్యంలో అప్రతిహత విజయాలతో పార్టీ దూసుకెళ్లతోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో రెకమేండెషన్లు, లాబీయింగ్‌లను, ఒత్తిళ్లను లెక్క చేయకుండా పార్టీని అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకునే వారిని ఎంతటి సీనియరైన పక్కనపెట్టాలని, సమర్దులను, గెలిచే వారికే అభ్యర్తిత్వాలను ఖరారు చేయాలని పార్టీ అధికారంలోకి తేవడమే ప్రథమకర్తవ్యమన్న లక్షయంతో షా పని చేస్తు అవసరమైన కార్యాచ రణను రూపొందించి అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీలో 60ఏళ్లకు దగ్గరైన వారిని దాటిని వారిని పక్కన పెట్టాలని ప్రధానంగా భావిస్తున్నారు. గెలిచినా ఓడినా ఒకరికి ఒక సారి మాత్రమే అవకాశం ఇవ్వాలని, డిపాజిట్లు దక్కని వారికి 2019 నాటికి 60 ఏళ్లుపై బడిన వారికి ఏ మాత్రం అవకాశమివ్వకూడదని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు పెద్దపల్లి విషయంలో అన్ని అంశాలు కలిసి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా 20ఏళ్ల పార్టీకి చిత్తురు, నెల్లురు, కడప, రంగారెడ్డి, హైద్రాబాద్‌ జిల్లాలో ఎబివిపి పుల్‌టైమర్‌గా, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాలో బిజెపి పుల్‌టైమర్‌గా పని చేసిన దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ వెంకయ్యనాయుడు, ఆరెస్సెస్‌ మెప్పు పొందారు బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షునిగా, బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేసారు. నక్సలెట్ల ప్రభావం అధికంగా ఉన్న సమయంలో ఉత్తర తెలంగాణ నుంచి రెండు సార్లు ఎబివికి రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన ఏకైక వ్యక్తి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ 1997లో తెలంగాణ కోసం మలిదశ ఉద్యమాన్ని ప్రజాయుద్దనౌక గద్దర్‌ ఉస్మానియా యూనివర్సిటి నుంచి మొదలు పెడితే, గద్దర్‌కుపోటిగా బాసర నుంచి శ్రీశైలం వరకు  ప్రచార కార్యక్రమం చేపట్టి రాష్టమ్రంతా పర్యటించారు. మోది రంగప్రవేశం, మారిన రాజకీయ పరిస్థితుల్లోవెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావులు పెద్దపల్లి టికెట్‌ను దుగ్యాల ప్రదీప్‌కుమార్‌కు ఖరారు చేసినట్టు సమాచారం. ప్రదీప్‌కుమార్‌తో పార్టీకి పుల్‌టైమ్‌ వర్కర్లులుగా పని చేసిన వారంతా ఎమ్మెల్యేలు, ఎంపిలుగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్‌ 2014లో ఆశించిన ప్రదీప్‌కు అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లో పెద్దపల్లిని పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. ఇక్కడ టిడిపి మద్దతుతో 1998లో బిజెపి అభ్యర్థిగా గుజ్జుల రామక్రిష్ణారెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం పెద్దపల్లి నుంచి రెండు సార్లు రామగుండం నుంచి ఒకసారి పోటి చేసిన గుజ్జులకు డిపాజిట్‌ గల్లంతయ్యింది. దీనికి ముందు మొట్టమొదటి సారిగా చొప్పదండి నుంచి పోటి చేసిన్పుడు కూడా గుజ్జులకు డిపాజిట్‌ దక్కలేదు. పార్టీ టికెట్‌పై 5సార్లు పోటి చేస్తే మద్దతుతో మాత్రమే ఒక్కసారి గెలిచి 4సార్లు ఓడిపోయారు. అది డిపాజిట్‌ గల్లంవ్వడం ఎక్కువ సార్లు పోటి చేయడం సీనియర్‌ కావడం వంటి అంశాలు గుజ్జులకు మైనస్‌గా మారినట్టు సమాచారం. అయితే మొదటి నుంచి దర్మారం, చొప్పదండిలపై శ్రద్ద చూపుతు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి అక్కడే క్వాడర్‌ను పెంచుకున్నాడని కార్యకర్తలు పేర్కోంటున్నారు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో భాగంగా దర్మారం కేంద్రంగా అంతర్‌గాం, రామగుండం పాలకుర్తిలతో నియోజకవర్గం ఏర్పడితే దర్మారం నియోజకవర్గం నుంచి గెలుపు సులువవుతుందని గుజ్జుల భావిస్తున్నట్లు సమాచారం. అందుకే జిల్లా పార్టీలో ప్రధాన పదవులన్ని దర్మారం, రామగుండానికి చెందిన తనవారికే ఇప్పించుకొని పెదపల్లి కంటే ధర్మారం నుంచి గెలుపు సులువుతుందని, అందు కోసం


గుజ్జల ప్రయత్నిస్తున్నట్లు కార్యకర్తలు పేర్కోంటున్నారు. కాగా


టికెట్‌పై పూర్తి భరోసా లభించినందు వల్లనే ప్రదీప్‌కుమార్‌ పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తు చాపకింద నీరులా తన కార్యకలాపాలను విస్తరిస్తున్నారని కార్యకర్తలు పేర్కోంటున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు కార్పోరేషన్‌ చైర్మేన్‌తో పాటు పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా ప్రదీప్‌ను నియమించనున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. కాగా ఈ నెల 22న పర్యటనకు వస్తున్న అమిత్‌షా అంతర్గత సమావే శంలో ప్రకటించే 35 మంది అభ్యర్థులంతా కరడుగట్టిన ఆరెస్సెస్‌ వాదులు, యువకులని సమాచారం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com