ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవతరణ అదరాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:55 AM

-రాష్ట్ర ఆవతరణ దినోత్సవ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌:   జూన్‌ రెండవతేదీన  పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించడానికి తగిన  ఏర్పాట్లను పకడ్భ ందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌  వివిధ శాఖల ఉన్నతాధికారులను  ఆదేశించారు. శనివారం సచివాలయంలో రాష్ట్ర అవతరణ ఉత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమన్వ య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  అజయ్‌ మిశ్రా, ముఖ్య కార్యదర్శి  అధర్‌ సిన్హా, నగర పోలీస్‌ కమీషనర్‌ మహేందర్‌ రెడ్డి, పర్యాటక కార్యదర్శి  బి.వెంకటే శం, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ నవీన్‌ మిత్తల్‌, జీహెచ్‌ఎంసీ  కమీషనర్‌ జనార్ధన్‌ రెడ్డి, హెచ్‌ఎండిఏ కమీషనర్‌ టి.చిరంజీవులు, హైదరాబాద్‌ కలెక్టర్‌  రాహుల్‌ బొజ్జా, ఫైర్‌ సర్వీసెస్‌ డిజి రాజీవ్‌ రతన్‌, మెట్రో వాటర్‌ వర్క్‌‌స ఎండీ దానకిషోర్‌, హోం శాఖ కార్యదర్శి  అనితా రాజేంద్ర,   అదనపు డిజి అంజనీ కుమార్‌,  విద్యాశాఖ డైరెక్టర్‌  కిషన్‌, టూరిజం కార్పొరేషన్‌ ఎండి. క్రిస్టి నా జడ్‌ చొంగ్తు  సాంసృ్కతి శాఖ డైరెక్టర్‌  ఎం హరికృష్ణ  ప్రొటోకాల్‌ డిప్యూటీ సెక్రటరీ అర్వీంధర్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్స వాన్ని పురస్కరించుకుని  ముఖ్యమంత్రి కేసీఆర్‌, తొలుత గన్‌ పార్క్‌ వద్ద తెల ంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ప్రసంగించనున్నారు.  వివిధ రంగాలలో ప్రతి భ కనబరిచిన 50 మందికి ఈసందర్భంగా అవార్డులను ప్రధానం చేయ నున్నట్లు అయన తెలిపారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా వృద్దా శ్రమాలు,  అనాధ శరణాలయాలు, ఆసుపత్రులు,  అంధ విద్యార్ధులకు  ప్రభు త్వ పక్షాన పండ్లు,స్వీట్లు పంపిణి చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా ఉత్స వాల ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు, ఎల్‌ ఈడి టివీ, పిఏ సిస్టం, కామెంటేటర్లు, కవరేజి తదితర పనులు చేపట్టాలని సియస్‌ ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నగరంలో ప్రధాన ప్రాంతాలైన  రాజ్‌ భవన్‌,అంసెబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్‌ తదితర ప్రాంతాలలో విద్యుద్ధీకరణ చేప ట్టాలని పేర్కొన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ లో పరిశుభ్రత, మొబైల్‌ టాయిలేట్ల ఏర్పా టు, ట్రాఫిక్‌ నియంత్రణ, పోలీస్‌ బందోబస్తు, నిరంతర విద్యుత్‌ సరఫరా, మంచినీటి సరఫరా, అంబులెన్సులు,  వైద్యనిపుణుల టీంలు, బారికేడింగ్‌, అగ్ని మాపక యంత్రాల ఏర్పాట్లు, పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈ సారి వేడుకలలో ఏక్‌ భారత్‌ - శ్రేష్ఠ భారత్‌ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హర్యానా ప్రభుత్వంతో కుదు ర్చుకున్న ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  భాగంగా  తెలంగాణ అవతరణ వేడుకల్లో హర్యానా నుండి ఒక కంటింజెంట్‌  పాల్గొంటుందని సీఎస్‌ తెలిపారు.   










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com