ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఠారెత్తిస్తున్న భానుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 21, 2017, 01:57 AM

-తెలుగు రాష్ట్రాల్లో పిట్టల్లా రాలుతున్న జనాలు 


(హైదరాబాద్‌, న్యూస్‌నెట్‌వర్క్‌) : తెలుగు రాష్ట్రాలలో నానాటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. శనివారం నాడు నల్లగొండ, రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం-45 డిగ్రీలు, నిజామాబాద్‌-45 డిగ్రీలు, కరీంనగర్‌-45 డిగ్రీలు, వరంగల్‌ 45 డిగ్రీలు, హైదరాబాద్‌-43 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌-43 డిగ్రీలు, రంగారెడ్డి-41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణవ్యాప్తంగా రికార్డుసా ్థయిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. విపరీతమైన వేడితో, వడగాలులతో నగరాలు, పట్టణాలు బట్టీలుగా మారిపో యాయి. శనివారం నాడు  సగటు ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదవగా, అత్యధికంగా రామగుండంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతగా నమోదయింది. మరో మూడునాలుగు రోజులు ఎండల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో నేడు ఉష్ణోగ్రత 43.6 డిగ్రీలుగా ఉన్నా, గాలిలో తేమ శాతం 14 నుండి 44 శాతానికి పెరగడం వల్ల విపరీతమైన చమటతో, శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముందని వాతావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరికలు జారీ చేశారు.ఈ తీవ్రతతో వేడి, వడగాలులకు శరీరం తట్టుకోలేనందున, పిల్లలు, పెద్దలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లేవారు ఉదయం 9 గంటలకల్లా బయటకు వెళ్లి ఎండ తీవ్రత తగ్గిన తర్వాతే ఇంటికి చేరుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. వేడిగాలులు, ఎండల నేపథ్యంలో చిన్నారులు,వృద్ధులను ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని సూచనలు చేస్తున్నారు. పెంపుడు జంతువులను కూడా బయటకు వదలొద్దని కోరారు.


అమరావతి పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలలో రానున్న వారం రోజులు ఎండల తీవ్రత పెరగడంతో ఆ జిల్లాలు మరింత మండిపోనున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలే మరో వారం పాటు ఉంటాయని వాతావరణ పరిశోధకులు, నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు గ్లోబల్‌ డేటాను ప్రామాణికంగా తీసుకుని రెండు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులను వెదర్‌ రీసెర్చ్‌ ఫోర్‌ కాస్టింగ్‌ (డబ్లూఆర్‌ఎఫ్‌) విధానంలో అధ్యయనం చేసి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫియర్‌ రీసెర్చ్‌ కేంద్రం, డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అట్మాస్ఫియర్‌ సైన్సు విభాగం సంయుక్తంగా విశ్లేషించాయి. రెండు జిల్లాల్లోని ప్రధాన నగరాల్లో రానున్న వారం రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎంత నమోద వుతాయో విశ్లేషించి వారానికి ఒకసారి ప్రభుత్వానికి సమాచారం అంద ేస్తోంది. మరో వారం పాటు అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కబోత కూడా రెండు జిల్లాల్లో తీవ్రంగా ఉంటుం దని వారి పరిశీలనలో వెల్లడైంది. ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో రెండు జిల్లాలకు చెందిన జనం ఉక్కిరిబిక్కిరి అవుతు న్నారు. పగలే కాదు రాత్రి పూట కూడా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఓ తీవ్రమైన ఉక్కబోత మరోవైపు వడగాలులతో ఇళ్లల్లో ఉండలేక, బయటకు రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఏ రోజు కారోజు ఉష్ణోగ్రతలు తగ్గి వాతా వరణం చల్లబడుతుందేమో ననే ఆశతో ఎదురు చూస్తున్న రెండు జిల్లాల వాసులకు ఈ పరిణామం మరింత ఆందోళనకు గరిచేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు జిల్లాల్లోని పలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సైతం 40 డిగ్రీల నుంచి గరిష్ఠంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం రోజుల పాటు ఈ ఎండ తీవ్రతలు ఇలానే ఉంటాయని కేఎల్‌ విశ్వవిద్యాలయం అధ్యాపకులు చెబుతున్నారు. రానున్న వారం రోజుల్లో సగటున రెండు జిల్లాల్లో గరిష్ఠంగా 45 నుంచి 48 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు ఉంటాయని అధ్యాపకుల విశ్లేషణ స్పష్టం చేసింది.


ప్రభుత్వ ఆదేశాల మేరకు : రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఎందుకు నమో దవుతున్నాయి. ఏ రోజు ఏ నగరంలో ఎలా ఉంటుంది..? రాష్ట్ర వ్యాప్తంగా ప్రధా న నగరాల్లో పరిస్థితి ఏమిటో వారం రోజులకు సరిపడా డేటాను ముందుగానే కేఎల్‌ విశ్వవిద్యాలయం విశ్లేషించి ప్రభుత్వానికి అందజేసేలా ఒప్పందముంది. ఈ సమాచారం ద్వారా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫియర్‌ సైన్స్‌లో సీనియర్‌ ఆచార్యుడు డాక్టర్‌ డి.వి. భాస్కరరావు పర్యవేక్షణలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ అట్మాస్ఫియర్‌ సైన్సు విభాగానికి చెందిన సహాయ ఆచార్యులు జీసీ సత్యనారాయణ ఈ సమాచారాన్ని విశ్లేషించి ఎప్పటి కప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి వారికి ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నారు. ప్రస్తుతం వీరి డేటాను దిల్లీలోని వాతావరణ పరిశోధన కేంద్రంలోని(ఐఎండీ) నిపుణులు కూడా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ధ్రువీకరించుకుంటున్నారు. సహాయ ఆచార్యుడు డాక్టర్‌ బీసీ సత్యనారాయణ ఇంతకు ముందు దిల్లీలోని వాతావరణ పరిశోధన కేంద్రంలో ఈ ఉష్ణోగ్రతల నమోదు డేటా సేకరణ విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఆయనే ప్రస్తుతం కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ఈ ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచార బాధ్యతలను చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశమైనా ఉష్ణోగ్రతలకు సంబంధించిన సమాచారం కోసం నోవాలోని గ్లోబల్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టం(జీఎఫ్‌ ఎస్‌)పై ఆధారపడతాయి. ఆ సమాచారాన్ని తీసుకుని కేఎల్‌ విశ్వవిద్యాల యం మన రాఫ్ట్ర పరిస్థితులకు అన్వయించి ఉష్ణోగ్రతలను ఏ రోజు ఎలా ఉంటాయో విశ్లేషిస్తుంది. ఇప్పటి దాకా తాము చేసిన అలర్ట్‌‌సలో పెద్ద తప్పిదాలు లేవని ఒక డిగ్రీ అటు ఇటుగా ఉంటోందని వివరించారు.


డబ్లూఆర్‌ఎఫ్‌ సాఫ్ట్‌వేర్‌తో : విశ్వవిద్యాలయంలో సూపర్‌ కంప్యూటర్‌ ఉంది. అందులో ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. ఈమొత్తం విశ్లేషణకు వెదర్‌ రీసెర్చ్‌ ఫోర్‌కాస్టింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మూలాధారమని దీని ద్వారానే తాము సమాచారాన్ని విశ్లేషణ చేయగలుగుతున్నామని సహాయ ఆచార్యుడు డాక్టర్‌ బీసీ సత్య నారాయణ వెల్లడించారు. రానున్న వారం రోజుల పాటు ఎవరూ ఎండలో దూర ప్రయాణాలు చేయొద్దని, అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. 


కారణాలివే : రాష్ట్రంలో ఎండ తీవ్రతకు కారణాలు ఇలా ఉన్నాయని ఈ అధ్య యనం నిపుణులు పేర్కొంటున్నారు. రాజస్థాన్‌ నుంచి ఎడారి గాలులు విదర్భ, తెలంగాణ రాష్ట్రాల మీదగా ఆంధ్రప్రదేశ్‌లోకి బాగా వీస్తుండటం, ఆ ప్రాంతాల్లో ఎక్కడా కూడా సముద్రం లేకపోవటంతో ఎడారి గాలులు నేరుగా కోస్తా తీర ప్రాంతానికి వస్తున్నాయి. సముద్రం నుంచి వచ్చే గాలితో భూమి బాగా వేడెక్కి పోతోంది. రెండు జిల్లాల్లో మచిలీపట్నం, బాపట్ల ప్రాంతాల్లో సముద్రం విస్త ంచి ఉండటంతో ఈ రెండు జిల్లాలపై వేడిగాలుల ప్రభావం ఉంటోంది. రెండు జిల్లాల్లో అడవుల విస్తీర్ణం తక్కువుగా ఉండటం కూడా అధిక ఉష్ణోగ్రతలకు కారణమే. రెండు జిల్లాల్లో నిర్మాణరంగం బాగా ఉండటంతో చెట్లు. చేమలకు స్థానం లేకుండా ఉంటోంది. అన్నింటికి మించి వాహనాల పెరుగుదల వాటి ద్వారా వెదజల్లే కాలుష్యం కూడా ఓ కారణమే. అదేవిధంగా పరిశ్రమలు రెండు జిల్లాల్లో విస్తారంగా ఉండటం వాటినుంచి వెలువడే పొగ, కాలుష్యం కూడా కారణమే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com