ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చిలో సినీ మహల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:45 AM

కళానిలయ క్రియేషన్స్‌ సమర్పణలో సిద్ధాంశ్‌, రేయాన్‌ రాహుల్‌, తేజస్విని హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సినీ మహల్‌‘. రోజుకు 4 ఆటలు ఉపశీర్షిక. లక్ష్మణ్‌ వర్మ దర్శకత్వంలో బి.రమేష్‌ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్‌ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కె క్కింది. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని  పూర్తి చేసుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది.  కొత్త తరహాలో సాగే కథనంతో ఆద్యంతం ఆకట్టుకునే చిత్రమిది. లక్ష్మణ్‌ వర్మ చక్కగా తెరకెక్కించారు. సిద్ధాంశ్‌, రాహుల్‌, తేజస్విని బాగా నటించారు. ముఖ్యంగా సలోనిగారు చేసిన స్పెషల్‌ సాంగ్‌ కు ఆడియెన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రవీ ణ్‌పూడి ఎడిటింగ్‌ సినిమాకు హైలైట్‌గా నిలు స్తాయి. సినిమాను మార్చి నెలలో విడుదల చేయడానికి స్నాహాలు చేస్తు న్నాం అన్నారు. గొల్లపూడి మారుతీ రావు, జీవా, జెమిని సురేష్‌ తది తరులు నటించిన ఈ చిత్రా నికి సినిమాటో గ్రఫీ: దొరై కె.సి.వెంకట్‌, సంగీతం: శేఖర్‌ చంద్ర, ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి, కళ: గోవింద్‌, ఎఫెక్ట్స: యతిరాజ్‌, లిరిక్స్‌: సుద్దాల అశోక్‌ తేజ,  సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్‌, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్‌, కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్‌ వర్మ.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa