ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పసుపుమయమైన ఎగ్జిబిషన్‌గ్రౌండ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:12 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహనాడు బుధవారం నాడు అంగరంగవైభవంగా ప్రారంభమైంది. ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌ మొత్తం పసుపుమయంగా మారింది. రాష్ట్ర పార్టీ నేతలు అనుకున్నదానికి అధికంగా పార్టీ శ్రేణులు మహానాడుకు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం వెళ్లివిరిసింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన ఈ మహానాడును టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డి  పార్టీ జెండా ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. కాగా... నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న మహానాడులో ’మా తెలుగుతల్లికి మల్లెపూల దండ’ గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మహానాడులో మొత్తం ఎనిమిది తీర్మానాలను టీడీపీ ప్రవేశపెట్టింది. భోజన విరామం లేకండానే పలు అంశాలపై తీర్మాణాలను ప్రవేశపెట్టారు


సందడిగా టీడీపీ మహానాడు ప్రాంగణం


నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలోని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ప్రాంగణం నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది. మహానాడు వేదికపై ఎల్‌.రమణ, రేవత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌, మోత్కుపల్లి నరసింహులు, నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎమ్మెల్యేసీతక్క, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఉమామా దవరెడ్డి, కె.దయాకర్‌రెడ్డి, సీతాదయాకర్‌రెడ్డి గరకెపాటి మోహన్‌రావు, మోత్కుపల్లి నర్సింలు, అరవింద్‌ కుమార్‌గౌడ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డితో పాటు రాష్ట్ర, జిల్లా పార్టీ బాధ్యులు ఆశీనులయ్యారు.  


తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్టస్థ్రాయి మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో 2015లో హైదరా బాద్‌లోనే పార్టీ జాతీయస్థాయి మహానాడు నిర్వహించినం దున రాష్టస్థ్రాయిలో విడిగా మళ్లీ ఏర్పాటు చేయలేదు. ఇంతకాలం జిల్లాస్థాయిలో మహానాడు నిర్వహించి ఒకేసారి జాతీయస్థాయి సదస్సుకు వెళ్లేవారు. ఈ ఏడాది నుంచి జిల్లాస్థాయి మహానాడు నిర్వహించడం లేదు. ఈ సారి టీడీపీ జాతీయస్థాయి మహానాడు 27 నుంచి విశాఖపట్నంలో జరగనుంది. మహానాడు నిర్వహణతో తెలంగాణ పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నింపాయి.  ఎనిమిది తీర్మానాలపై చర్చ..: సదస్సులో మొత్తం 8 తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చించారు.  విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు; పడకేసిన వెద్యరంగం; రైతుల సమస్యలు; మూతపడుతున్న పరిశ్రమలు-తగ్గిపోతున్న ఉద్యోగాలు; సాగునీటి పారుదల రంగం; కుల, చేతివృత్తులకు అందని సామాజిక న్యాయం; టీఆర్‌ఎస్‌  ప్రభుత్వ వెఫల్యాలు; ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ అనే అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టారు. తీర్మాణాలనుపార్టీ సీనియర్‌నేతలు ప్రవేశపెట్టగా ఒకరిద్దరు జిల్లా నేతలు బలపరిచారు. 


 మహానాడుకు  ఎమ్మెల్యే కృష్ణయ్య డుమ్మా...


తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఆపార్టీకి చెందిన ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే ఆర్‌. కృష్ణ్ణయ్య హాజరు కాలేదు. ఈ విషయం కాస్త చర్చనీయాంశమైంది. తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ఎమ్మెల్యే రాకపోవడం పట్ల పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈయన కూడా త్వరలో జంప్‌ జిలానీల గ్రూపులో చేరతారా... అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com