ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూసేకరణ చట్టాన్ని ఆపండి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:30 AM

-రాష్టప్రతికి ఏపీ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు


న్యూఢిల్లీ, మేజర్‌న్యూస్‌ : యూపీఏ సర్కార్‌ రైతుల ప్రయోజనాల కోసం తీసు కొచ్చిన భూసేకరణచట్టం-2013లో ఏపీలోని టీడీపీ సర్కార్‌ సవరణలు చేయడంపై జోక్యంచేసుకోవాలని రాష్టప్రతి ప్రణభ్‌ ముఖర్జీని ఏపీ కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తిచేశారు. బుధవారంనాడు రాష్టప్రతిని కలసిన వారిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌, ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి, పార్టీ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతోపాలు టి. సుబ్బిరామిరెడ్డి, జే.డీ.శీలం పలువురు సీనియర్‌ నేతలు ఉన్నారు. ఈ సంద ర్భంగా భూసేకరణ చట్ట సవరణ వల్ల జరిగే నష్టాలపై వారు రాష్టప్రతికి ఓ వినతిపత్రం అందజేశారు. వాటి సారాంశం ఇలావుంది. ‘‘కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చారిత్రాత్మక ‘‘ రైట్‌ టు ఫెయిర్‌ కాంపెన్‌సేషన్‌ అండ్గ ట్రాన్స్‌పరెన్సీ ఇన్‌ లాండ్‌ అక్విజిషన్‌  రీహేబిలిటైజేషన్‌ అండ్‌ రీసెటిల్‌మెంట్‌ యాక్ట్‌2013కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 2014వ సం’’లో ఆర్డినెన్స్‌ రూపంలో భూసేకరణ చట్టం2013కు స్పూర్తికి పూర్తి  విరుద్దంగా ప్రవేశపెట్టిన సవరణలతో పోలి ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్‌ 107 ప్రకా రం చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలు, ఇతర రక్షణలు మరింత మెరుగ్గా లేనట ్లయితే చట్టానికి సవరణలు చేయరాదు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన సవరణలు 2013 భూసేకరణ చట్టంలో పేర్కొన్న ప్రయోజనాలు, రక్షణల కంటే మెరుగ్గా లేకపోగా అందుకు విరుద్దంగా ప్రయోజనాలు, రక్షణలను తగ్గించి వేసింది. దీని వెనుక రాష్ర్ట ప్రభుత్వ దురుద్దేశ్యం స్పష్టమవుతోంది. భూసేకరణ చట్టం2013లో పేర్కొన్న ప్రకారం ప్రజలకిచ్చిన హక్కులను కాలరాసి భూసే కరణను తేలిగ్గా చేపట్టడమే వారి ముఖ్యోద్దేశమని చెప్పకనే చెప్పినట్లయింది. రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన సవరణల్లో ప్రధానమైన అభ్యంతరాలు, 1.ప్రజా ప్రయోజనాలు లేకుండానే భూసేకరణ. ఈ సవరణల వల్ల రాష్ర్ట ప్రభు త్వం ఓ లాండ్గ మాఫియాగా మారనుంది (సెక్షన్‌ 10ఎ, 23ఎ, 31ఎ చూడండి) , రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక తరగతి ప్రాజెక్టులను ప్రతిపా దించింది. వాటి కోసం పెద్ద ఎత్తున భూసేకరణ చేయబోతోంది. అదేమంటూ భూసేకరణ చట్టం2013ను కాదని సవరణలతో తెచ్చిన కొత్త చట్టాన్ని అనుసరించబోతోంది. సవరణలతో తెచ్చిన కొత్తచట్టం వల్ల రాష్ర్ట ప్రభుత్వం బాధితులకు పునరావాసం, పరిహారం చెల్లించకుండానే ఇష్టానుసారంగా భూములను సేకరించుకునే వెసులుబాటు కలిగింది. పైగా భూసేకరణ నిర్భంధంగా, బలప్రయోగంతో చేపట్టి పునరా వాసం, పరిహారాలకు బదులుగా కొంత మొత్తం సొమ్ము ఇచ్చి సరిపెట్టే అవ కాశం ఏర్పడినట్లయింది. సవరణలతో తెచ్చిన కొత్త చట్టంలోని అర్జెన్సీక్లాజ్‌ ద్వా రా భూసేకరణ వల్ల కలిగే సామాజిక ప్రభావాన్ని అంచనా వేయనక్కర్లేదు. సేకరి స్తున్న భూములు ప్రజా ప్రయోజనాల కోసమేనా అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోనక్కర్లేదు. 2. సామాజిక ప్రభావ అంచనా ప్రక్రియను ఎత్తివే శారు:, కొత్త చట్టంలో తెచ్చిన సవరణలు సామాజిక ప్రభావ అంచనాలు మరియు సామాజిక ప్రభావాన్ని సమర్థవంతంగా నిర్వహించే కార్యా చరణ(ప్లాన్‌)ను ఎత్తేశారు.  (సెక్షన్‌ 10ఎను చూడండి) సెక్షన్‌10ఎ...భవిష్యత్‌ అవసరాల కోసం సామాజిక ప్రభావం అంచనాను నిర్వహించే అవసరం లేకుండానే భూసేకరణ చేపట్టే వెసులుబాటు కల్పించింది. 3. ఈ సవరణల వల్ల ప్రజా ప్రయోజనార్థం ప్రైవేట్‌ కంపెనీల కోసం భూములు సేకరించడానికి అవసరమైన ఆమోదం కావాలన్న నిబంధన తొలగించబడింది. (సెక్షన్‌2లోని సబ్‌ సెక్షన్‌2ను చూడండి), ప్రజా ప్రయోజనార్థం ప్రైవేట్‌ కంపెనీల కోసం భూసేకరణ చేయాల్సివచ్చినప్పుడు భూమిలిచ్చే వ్యక్తుల అంగీకారం 80 శాతం మేర లేదా 70 శాతం మేర ఉండాలన్న నిబంధన భూసేకరణ చట్టం 2013లో స్పష్టంగా ఉంది. కానీ సవరణలు తెచ్చిన చట్టంలో ఈ నిబంధన తొలగించారు. అంటే ప్రైవేట్‌ కంపెనీలకు భూములు సేకరించి ఇచ్చే ప్రభుత్వయత్నాలను అడ్డుకునే హక్కును భూ యాజమానులు కోల్పొయారు, 4. ఆహార భద్రత రక్షణలను తొలగించిన సవరణలు: (సెక్షన్‌ 10ఎ చూడండి), ఆహార భద్రతను దష్టిలో పెట్టుకొని రెండుమూడు పంటలు పండే వ్యవసాయ భూములను సేకరించడానికి సంబంధించి కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం2013లో కొన్ని పరిమితులు విధించడం జరిగింది. కానీ కొత్త చట్టంలో వాటిని తొలగించారు. తద్వారా.. . వ్యవసాయం యోగ్యమైన 3,4 పంటలు పండే భూములను ఇష్టానుసారం సేకరించే వెసులుబాటు కల్పించింది.   5.పునరావాసం అక్కర్లేదు రీసెటిల్‌మెంట్‌ అక్కర్లేదు. చట్టంలో చేసిన సవరణల వల్ల భూసేకరణ చేసినప్పుడు పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ చెల్లించనక్కర్లేదు. అంటే పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ ఇవ్వక్కర్లేకుండానే భూసేకరణ చేయొచ్చు. (సెక్షన్‌ 31ఎ చూడండి) 2013 చట్టం అమలు జరిగితే భూములిచ్చిన వారికి పునరావాసం, రీసెటిల్‌మెంట్‌లలో మెరుగైన ప్యాకేజీ అందుతుంది. దీని వెనుక నున్న ముఖ్యోద్దేశం కూడా పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ల వల్ల భూములిచ్చిన వారు కొత్త జీవితాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా, తగిన ఆదాయం పొందేలా చేయడమే. అయితే ప్రధాన చట్టానికి తెచ్చిన సవరణల వల్ల ఒకేసారి కొంత మొత్తాన్ని ఇచ్చి సెటిల్‌ చేసేస్తారు. పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ ఉండవు. ప్రధాన చట్టంలోని సెక్షన్‌ 107కు విరుద్దంగా పరిహారంలో తగ్గింపులు  క్రూరమైనవి. 


6. అత్యవసర నిబంధన (అర్జెన్సీక్లాజ్‌)ను ఇష్టానుసారం విస్త్రుతంచేశారు. రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన సవరణలు...నిజానికి అత్యవసర నిబంధన పరిధిని విస్త్రుప ర్చింది. దీని వల్ల ఏ అవసరమైనా...అది అత్యవసరం అవుతుంది. (2013 చట్టంలోని సెక్షన్‌ 40ను మార్చడానికి చేసిన ప్రతిపాదన చూడండి), ఈ సవర ణలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి భూసేకరణకు సంబంధించి విశేషాధికారాలు  దఖలు పడతాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వాలకు అందించిన మార్గ దర్శకాలకు అనుగుణంగా... అనేటటువంటి సాకును చూసి అత్యవసర నిబం ధన (అర్జెన్సీ క్లాజ్‌)ను ప్రయోగించబడుతుంది. భూసేకరణ చట్టం1994లో అత్యంత దుర్వినియోగపర్చబడిన నిబంధన ఏదైనా ఉంది అంటే అది అర్జెన్సీక్లాజ్‌. దానిని అనేక సందర్భాల్లో తరచుగా ఎటువంటి హేతుబద్దత లేకుండా ఉపయోగించారు. ఫలితంగానే 2013 చట్టం దీనిని ఉపయోగించ డానికి అనేక నిబంధనలు, పరిమితులు విధించింది. ప్రస్తుతం రాష్ర్ట ప్రభుత్వం  ఆ కఠినమైన రక్షణలను తొలగించి...2013 చట్టంకు ముందు అమలు జరిగిన అసంబద్దమైన పెత్తందారి పరిపాలనను పునరావతం చేయాలనుకుంటోంది. 7.రీహేబిలిటేషన్‌, రీసెటిల్‌మెంట్‌ ప్రయోజనాలలో పెంపుదల లేదు పరిహా రంలో పెంపుదల లేదు. రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన సవరణలు నష్టపరిహారం పెంపుదలకు సంబంధించిగానీ, రీహేబిలిటేషన్‌ మరియు రీసెటిల్‌మెంట్‌ పెరుగుదలకు సంబంధించిన వెసులుబాట్లు లేవు. రాష్ర్ట ప్రభుత్వం చేసిన సవరణలు 2013 భూసేకరణ చట్టంలో పొందుపర్చిన నష్టపరిహారం, రీహేబి లిటేషన్‌, రీసెటిల్‌మెంట్‌ మొత్తాలను గణనీయంగా తగ్గించివేస్తామన్నది సుస్ప ష్టం. పైన పేర్కొన్న ప్రజావ్యతిరేక చర్యలను పరిగణలోని తీసుకొని గౌరవ భారత రాష్ర్టపతిగారు భారత రాజ్యాంగం 254(2) అధికరణ ద్వారా తనకు సంక్ర మించిన అధికారాలను ఉపయోగించాల్సిందిగా కోరుకుంటున్నాము. బాధిత కుటుంబాలవారికి కీలకమైన రక్షణలను తొలగించడానికి, వారి హక్కులను హరించడానికి రాష్ర్ట ప్రభుత్వం చేసిన సవరణలను క్షుణ్ణంగా పరిశీలించి వాట ిని తిరస్కరించే అధికారం గౌరవ రాష్ర్టపతిగారికి ఉన్నది.మా విన్నపం ఏమంటే రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం బాధిత కుటుంబాలు ఎంతో పోరాడి సాధించుకున్న హక్కులను, రక్షణలను పరిపాలన సౌలభ్యం అనేపేరుతో తొల గించి ఇష్టానుసారం, విచ్చలవిడిగా అవసరం లేకున్నా భూసేకరణకు పాల్పడే అవకాశం ఉంది కనుక తమరు తక్షణం జోక్యం చేసుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము’’. అని ఆ లేఖలో పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com