ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబద్ధాల అమిత్‌షా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:38 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ప్రధాని నరేంద్రమోదీతో ఎటువంటి విభేదాలు లేవన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌,  తప్పులు, అబద్దాలు, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసి జాతీయ, అంతర్జాతీయ విపణిలో తెలంగాణ సమాజం పరువుతీసే ప్రయత్నం చేసిన  బీజేపీ జాతీ యాధ్యక్షుడు అమిత్‌షా, భేషరుతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. మోదీ అంటే తనకు ఎనలేని గౌరవముంద న్నారు. ఈ మూడేళ్ల కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎటువంటి అవినీతి కుంభకోణాలు జరగలేదన్నారు. కేంద్రంతో రాజ్యాంగపరమైన సంబంధాలు కొనసాగి స్తామని తెలిపారు. ఒకవైపు మోదీని ఆకాశానికెత్తిన కేసీఆర్‌, తెలంగాణకు లక్షకోట్ల నిధులిచ్చామన్న అమి త్‌షాపై  నిప్పులు చెరిగారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకు మినహాయించి  అదనంగా తమకు ఒక్క రూపాయ ఇచ్చింది లేదన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా  కొన్ని ఇప్పటి వరకు రాలేదని చెప్పారు. ఇప్పటి వరకు ఫెడరల్‌ స్ఫూర్తిని అనుసరించి,  రాజ్యాంగబద్దంగా తెలంగాణకు కేంద్రం 67.390 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.  కేంద్రంలో బీజేపీ కాదు,  పీజేపీ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి  రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాల్సిందేనన్నారు. అన్ని రాష్ట్రాలకు  ఇచ్చిన మాదిరిగానే కేంద్రం నుంచిరాష్ట్రానికి  నిధులు వచ్చాయి తప్పితే ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదని గణాంకాలతో సహా సీఎం వివరించారు. బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలతో కలిసి విలేకర్లతో మాట్లాడుతూ  చిల్లర రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తారా ? అంటూ అమిత్‌షాను సూటిగా ప్రశ్నించారు. అమిత్‌షా వ్యాఖ్యలపై తాము మౌనంగా ఉంటే అంతా నిజమేనని  అనుకుంటారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడవల్సిన మాటలేనా అంటూ నిలదీశారు.  తెలంగాణకు ఇప్పటి వరకు వివిధ రూపాల్లో  కేవలం 67. 390 వేల కోట్ల రూపాయల  నిధులిచ్చారన్న కేసీఆర్‌, ఇంతకు మించి అదనంగా నిధులిచ్చినట్లు అమిత్‌షా రుజువు చేసినా,    నేను చెప్పేది తప్పని  తేలినా తన  ముఖ్యమంత్రి  పదవికి రాజీనామా చేస్తానంటూ  సవాల్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యటన ముగించకముందే అమిత్‌షా  తాను మాట్లాడిన మాటలు తప్పని ఒప్పుకోవాలన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలు ఆయన్ని  క్షమించరన్నారు. అమిత్‌ షా,  భ్రమిత్‌షా వచ్చి నల్గొండ కూడలిలో పాములాట పెట్టి చెబితే కేసీఆర్‌ భయపడతాడా అని ప్రశ్నించారు. నన్ను తిడితే పట్టించుకోనన్న కేసీఆర్‌, తెలంగాణను కించ పరిచేవిధంగా, ప్రగతి కుంటుపడే విధంగా ఎవరు మాట్లాడినా  సహించేది లేదంటూ  స్పష్టం చేశారు. రాష్ట్రానికి  పెన్షన్లు ఇచ్చేగతి లేదని మాట్లాడిన అమిత్‌షాకు అసలు  మతి ఉండి మాట్లాడు తున్నారో , లేక  మాట్లాడుతున్నరో  తెలయదని ఎద్దేవా చేశారు. 38 లక్షల మందికి నేటి వరకు అంతరాయం లేకుండా నెలా నెలా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని, పెన్షన్లు ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌ అని చెప్పారు.  వికలాంగులకు రూ.1500 పెన్షన్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం తెలిపారు. కొన్ని కేంద్రపథకాలను ఎన్డీఏ సర్కార్‌ ఎత్తివేసినా తాము కొన సాగిస్తున్నట్లు తెలిపారు. యూపీఏ హయాంలో తీసుకువచ్చిన మోడల్‌ స్కూ ళ్లను ఎన్డీఏ సర్కార్‌ ఎత్తివేసినా, తాము కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అలాగే అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జీతాలు కాకుండా అద నంగా పెంచి ఇస్తున్నామన్నారు. ఆశా వర్కర్లకు కూడా జీతాలు పెంచి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడడం లేదన్న అమిత్‌షా వ్యాఖ్యలపై ఆయన భగ్గుమన్నారు. సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే,  కేంద్ర ప్రభుత్వ అందజేస్తున్న మ్యాచింగ్‌ గ్రాంట్‌ 209 కోట్ల రూపాయలంటూ ఎద్దేవా చేశారు. సముద్రంలో కాకిరెట్ట వేసినట్లుగా నిధులిస్తూ, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదని హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రాన్ని కొత్త రాష్టమ్రైన తమకు  ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని మూడేళ్లుగా అడుగు తున్నామని ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదన్నారు. అలాగే మిషన్‌ భగీరథ, కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల రూపాలయలివాలంటూ ప్లానింగ్‌కమిషన్‌ పేర్కొన్న ఇంతవరకు అతిగతీ లేదన్నారు. 


  న్యాయవ్యవస్థ విభజన జరగనంత వరకూ రాష్ట్ర విభజన జరిగిందని అనుకో లేమన్నారు. తెలంగాణ ప్రజలను అమిత్‌ షా తక్కువ చేసి  చూడడాన్ని సీఎం తప్పుపట్టారు. అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగిసు ్తన్నాయని, అందుకే తాను ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ప్రజలకు వాస్త వాలు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు. రాష్ట్రం గురించి చెడుగా మాట్లాడితే, పెట్టుబడులు కోల్పోయే ప్రమాదముందన్న  కేసీఆర్‌,  అమిత్‌ షా తన వ్యాఖ్యలతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగావ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. అమిత్‌ షాకు ఎటుపడితే అటు మాట్లాడే అలవాటని, దాని వల్ల తెలంగాణ ప్రగతికి ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశా రు. బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు. తెలం గాణను నిందించిన వారేవరైనా వాళ్లు తమకు శత్రువులేనన్న ముఖ్యమంత్రి,  వాళ్లను వదలిపెట్టేది లేదన్నారు.  అమిత్‌ షా కాదని, తెలంగాణ తనకు బాదుషా అని చెప్పారు.  దేశాన్ని పోషించే రాష్ట్రాల్లో  తెలంగాణ ఒకటని  కేసీఆర్‌ తెలిపారు. భారత దేశాన్ని పెంచి పోషించే రాష్ట్రాలు  ఆరు, ఏడు ఉంటయని, మిగతావన్నీ లోటు బడ్జెట్‌ రాష్ట్రాలేనని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ  ధనిక రాష్ట్రాల్లో ఒకటన్నారు.  రూ.లక్ష కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం కోసం తెలంగాణ అందిస్తున్నదన్నారు.  హైదరాబాద్‌ నుంచి రూ.లక్ష కోట్ల సాఫ్ట్‌వేర్‌  ఎగుమతులు జరుగుతున్నట్లు తెలిపారు.  దళితులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు చెప్పుకుంటున్న అమిత్‌షా, నల్గొండ జిల్లా తెరట్‌పల్లి గ్రామంలో దళితులతో కలిసి చేసిన సహపంక్తి భోజనం దళితవాడల్లో వండింది కాదన్నారు. తెరట్‌పల్లి పక్కనే ఉన్న కమ్మగూడెం అనే గ్రామంలో బీజేపీ ప్రధానకార్యదర్శి మనోహర్‌రెడ్డి పర్య వేక్షణలో వండి తెరట్‌పల్లికి తరలించారన్నారు. నల్గొండలోను అదేవిధంగా చేశారన్న ఆయన, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని గ్రహించి భువ నగిరిలో మాత్రం దళితవాడల్లోనే వండిన భోజనాన్నే అమిత్‌షా భుజిం చారన్నారు.  దళితులపై ఎంతో ప్రేమున్నట్లు చెబుతున్న కేంద్రం తన బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం 3.98 శాతం నిధులు ఖర్చు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం 15.01 శాతం నిధులు ఖర్చు చేస్తోందని చెప్పారు. కేంద్రప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం రూ.52,392 కోట్లు ఖర్చు చేస్తుందన్న కేసీఆర్‌, రాష్ట్ర పభ్రుత్వం ఎస్సీల సంక్షేమం కోసం 14,375 కోట్లు, ఎస్టీల సంక్షేమం కోసం రూ.31,919 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు.గత సెప్టెంబర్‌లో రాష్ట్రంలో  పర్యటించిన అమిత్‌షా,  తెలంగాణకు 90వేల కోట్లు ఇచ్చామన్నారని, అప్పుడు ఆయన  వ్యాఖ్యలను తెలికగా తీసుకున్నామని తెలిపారు. 


ఒక్కసీటు రాదు 


2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మాట దేవుడెరగని, తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే  తెలంగాణలో  బీజేపీి ఒక్క సీటు కూడా దక్కదని కేసీఆర్‌  వెల్లడించారు. అమిత్‌ షా ఎన్ని మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్మరని వాస్తవాలు ప్రజానికానికి తెలుసన్నారు. ఇట్లాంటి అమిత్‌షాలు వంద మంది వచ్చినా ఏమి చేయలేరని, అవస్తవాలు మాట్లాడితే ఎవరినైనా వదిలిపెట్టేది లేదన్నారు. నోట్ల రద్దు సందర్భంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి  కూడా మద్దతు చెప్పలేదని, ప్రధాని మోడీకి సపోర్ట్‌ చేసిన ఏకైక ముఖ్యమంత్రి తానేనని  గుర్తు చేశారు. అమిత్‌ షా ఎన్ని మాట్లాడినా ఇప్పటికీ తనకు మోదీ అంటే గౌరవమని, కేంద్రంతో రాజ్యాంగపరమైన సంబంధాలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్‌ స్ఫష్ట చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com