ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కష్టపడితే పునర్వైభవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:39 AM

-మినీ మహానాడులో కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం


హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : తెలంగాణలో టీడీపీ జెండా రెపరెప లాడే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలా డుతుందన్నారు. తెలంగాణలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది టీడీపీ పార్టీ అన్నారు. టీడీపీ పార్టీ నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అన్న చంద్ర బాబు కార్యకర్తలే టీడీపీకి బలమన్నారు. తెలంగాణలో ప్రతీ కార్యకర్త కొద మసింహాల్లా దూసుకెళ్తున్నారంటూ. పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. తెలుగు ప్రజలను ఢిల్లీలో తాకట్టు పెడుతుంటే అది చూసి స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలిపారు. పార్టీ స్థాపించిన తొమ్మింది మాసాల్లోనే అధికారంలోకి తీసుకొచ్చి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషిచేశారన్నారు.  టీడీపీ వచ్చిన తర్వాతే తెలంగాణలో అనేక మార్పులు వచ్చాయని పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు తెలిపారు. కష్టపడటం తన జీవిత ఆశయంగా చెప్పిన చంద్రబాబు కష్టపడటం వల్లే పార్టీ బాగుపడుతోందన్నారు. తెలుగు దేశం పార్టీ ఎక్కడున్నా ప్రజల కోసమే పోరాటం చేస్తోందన్న ఆయన తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉండే పార్టీ టీడీపీ అని తెలిపారు. ఏపీలో అధికారంలో ఉన్నామని, తెలంగాణాలో పార్టీ ప్రతిపక్షంలో ఉందని, ప్రజల కోసం నిరంతరం పోరాడుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ హయా ంలోనే హైదరాబాద్‌ అభివృద్ధికి గట్టి పునాది పడిందన్నారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు నేడు హైదరాబాద్‌ అన్ని రంగాల్లో  ముందుందన్నారు. రహదారుల అభివృద్ధి, హైటెక్‌ సిటీ నిర్మాణం, ఆసుపత్రుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. వీటితో పాటు విద్యావ్యవస్థను సమూల మార్పులు చేశామన్నారు. విధ్యాభివృద్ధి వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ధృడమైన నమ్మకంతో స్కూళ్లు, ప్రతి మండలంలో కళాశాల, నియోజకవర్గంలో డి గ్రీ కళాశాలలు, రెవెన్యూ డివిజన్‌లో ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే నన్నారు. వీటితో పాటు తెలంగాణాలో సాగునీటి ప్రాజె క్టులను ప్రారంభిం చామన్నారు. తమ హయాంలో చేపట్టిన ప్రాజె క్టులు ఇంకా పూర్తి కావడంలేదని, ఇవి పూర్తి అయితే లక్షలాది ఎక రాలు సాగులోకి వస్తాయన్నారు. తెలంగాణాలో సైకిల్‌ స్పీడ్‌ పెంచు తామని..బుల్లెట్‌ లా దూసుకెళ్తామన్నారు. తెలంగాణలోని జిల్లాలలో జిల్లాలో కిలోమీటరుకు ఒక పాఠశాల కట్టించామని, వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేశామన్నారు. అభివౄఎద్ధికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని తెలిపారు. కార్యకర్తల త్యాగాలతో పార్టీ ముందుకు వెళ్తున్నదన్నారు. హైదరాబాద్‌లో పార్టీ ప్రారంభించారని, ఇక్కడి నుంచే  పాదయాత్ర చేసినట్లు తెలిపారు. తెలుగుజాతి ఆత్మగౌరం కోసం పార్టీ పుట్టిందన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్‌ ఉంటార న్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందన్నారు. 


అమరవీరులకు మొండి చెయ్యి : రేవంత్‌


అమరవీరుల ఆత్మబలిదానంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ అమరవీరులకు మొండిచెయ్యి చూపించారని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తొలి, మలి రాష్ట్ర ఉద్యమంలో అమరులైనవారిని ఆదుకోవటం లేదన్నారు. అమరవీరులను ఆదుకునే విషయంలో మహానాడులో కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియమకాలు గురించి చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఆ మాటలు మరిచిపోయిందని ఆరోపించారు. ట్యాంక్‌బండ్‌పై అమరుల స్థూపాన్ని నిర్మిస్తామని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మూడేళ్లు అయినా నిర్మించలేదన్నారు. రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలను కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదుకుంటారని, కడుపులో పెట్టుకుని చూసుకుంటారని ఓట్లు వేసి గెలిపించారని, అయితే గెలిచిన తర్వాత వారిని పట్టించుకోవడంలేదన్నారు. ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన కేసీఆర్‌ అమరులను గుర్తించడంలేదన్నారు. ఇప్పటి వరకు కేవలం 500మందిని మాత్రమే గుర్తించారని, వీరికి రూ.పదిలక్షల పరిహారం ఇచ్చి చేతులు దుపులుపుకున్నారని, ఉద్యోగం, భూమి ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ఉద్యమంలో రాజకీయపార్టీలు, ప్రజా ఉద్యమకారులు విఫలమైతే ఓయూ విద్యార్థులు ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య లేదని, విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయడంలేదన్నారు. అలాగే బడుగు, బలహీన వర్గాలకు రూ.4300కోట్లు ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అంతకు ముందు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి నిరుద్యోగ అంశంపై జరిగిన తీర్మానం చర్చలో పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com