ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఆసక్తిగా మారిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 10:32 AM

హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. టీచర్ ఎమ్మెల్సీ కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అభ్యర్థులు తమకు మద్దతు ఇస్తున్న రాజకీయపార్టీల నేతలను రంగంలోకి దింపారు. పోటీలో ఉన్నవారు తమ గెలుపుపై విశ్వాసంతో ముందుకువెళుతున్నారు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఎమ్మెల్యేల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ మార్చి 20 వ తేదికి మార్చినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి వరీందర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ప్రకటించినట్టుగా మార్చి 17న పోలింగ్‌ జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో దాన్ని 20 వతేదీకి మార్చి, అదేరోజు ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa